Delhi HC on PM Modi Degree: ప్రధాని విద్యా రికార్డును బహిర్గతం చేయరు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:17 PM
ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది.
ఢిల్లీ, ఆగస్టు 25: ప్రధాని నరేంద్ర మోదీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ప్రధాన సమాచార కమిషన్(CIS) ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. సమాచార హక్కు (RTI) పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలని పేర్కొంటూ ప్రధాన సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది.
ప్రధాని మోదీ విద్యా రికార్డ్, డిగ్రీ (PTI) గురించిన సమాచారం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సచిన్ దత్తా తెలిపారు. అయితే, ఈ అంశంపై ఇరు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ విద్యా రికార్డులను బహిర్గతం చేయడంపై దాదాపు దశాబ్ద కాలంగా ఈ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వాస్తవానికి 1978లో DU(ఢిల్లీ యూనివర్శిటీ) నుంచి BA పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు ప్రధాని మోదీ తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు.
ప్రధాని మోదీ విద్యా రికార్డు కోసం 2016లో RTI దరఖాస్తుతో ఈ వ్యవహారం ప్రారంభమైంది. మూడో పక్షానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోకూడదనే నియమాలను పేర్కొంటూ విశ్వవిద్యాలయం దానిని తిరస్కరించింది. అయితే, ప్రధాన సమాచార కమిషన్ (CIC) ఈ వాదనను అంగీకరించలేదు. అంతేకాదు, డిసెంబర్ 2016లో DU తనిఖీని అనుమతించాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ప్రధానమంత్రి విద్యార్హతలు పారదర్శకంగా ఉండాలని చెప్పింది. అలాగే ఈ సమాచారాన్ని కలిగి ఉన్న రిజిస్టర్‌ను ప్రజాపత్రంగా పరిగణిస్తారని కూడా CIC పేర్కొంది. దీంతో ఆ ఉత్తర్వునకు వ్యతిరేకంగా హైకోర్టును ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆశ్రయించింది.
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసులో తన వాదనలు వినిపిస్తూ, వేలాది మంది విద్యార్థుల గోప్యత హక్కు ప్రజలు తెలుసుకునే హక్కు కంటే విలువైందని వాదించారు. డేటాను విడుదల చేయడం ప్రమాదకరమన్నారు. విశ్వవిద్యాలయం రికార్డును కోర్టు పరిశీలన కోసం సమర్పించడానికి సిద్ధంగా ఉంటుందని, కానీ దానిని బహిరంగపరచకూడదని ఆయన చెప్పారు. రికార్డును కోరుకునే వాళ్లు.. ప్రచారం కోసమో.. లేదా రాజకీయ ఉద్దేశ్యాలతోనో కోరుతున్నారని అన్నారు.
అయితే, RTI తరఫు న్యాయవాది దీనికి భిన్నంగా తన వాదన వినిపించారు. మోదీ విద్యా రికార్డును కోరుతున్న కార్యకర్తల ఉద్దేశాన్ని తాము పరిగణనలోకి తీసుకోమని వాదించారు. డిగ్రీ అనేది రాష్ట్రం మంజూరు చేసే అర్హత. ఇది ప్రైవేట్ విషయం కాదని, ప్రధానమంత్రి విద్యార్హతలు ముఖ్యమైన ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయమని కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి
ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
For More AP News And Telugu News