Devotional: ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం...
ABN, Publish Date - Nov 16 , 2025 | 07:19 AM
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు... అయితే... కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి త్వరలో ఫలిస్తుందని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
అనుగ్రహం
16 - 22 నవంబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యో న్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావనతగదు. మీ మాటలు జారవేేస వారున్నారని గమనించండి. ఆందోళన తగ్గి కుదుటపడతారు.పత్రాల్లో సవరణలు సాధ్యం కావు. ఓర్పుతో మరోసారి యత్నించండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రావలసిన ధనం అందు తుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుం టారు. కొత్త యత్నాలు చేపడతారు. పరిచ యం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయేసకరణకు కొందరు యత్నిస్తారు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. న్యాయ నిపుణులను సంప్రదిం చండి. ఒంటెద్దు పోకడ తగదు. మీ నిర్ణయం పైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి బాగుంది. ఆలోచ నలు కార్యరూపం దాల్చుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు అను కూలిస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. ఇతరులను మీ విషయాలకుదూరంగా ఉంచండి. ఒక సంఘటన దిగ్ర్భాంతికి గురి చేస్తుంది. ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులకు చేరువవు తారు. అందరితో మితంగా సంభాషించండి. శుభకార్యానికి హాజరవుతారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్య పరిష్కార మవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలివారి తాహతును తెలుసుకోండి. ఫోన్ సందేశాల పట్ల అప్ర మత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
కొంతమేరకు ఆశాజనకం. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు వేగవంతమవు తాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఇతరుల బాధ్యతలు చేపట్టవద్దు. నచ్చని విషయాలను సున్నితంగా తెలియజేయండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. మనస్థిమితం ఉండదు. ఖర్చులు విపరీతం. కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త విష యాలు తెలుసుకుంటారు. స్థిమితంగాపనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిం చండి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసిద్ధికి పట్టుదల ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. చేస్తున్న పనులపై ధ్యాసపెట్టండి. మీ ఏమరుపాటు ఇబ్బంది కలిగిస్తుంది. రావలసిన ధనం ఆల స్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరివద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారంతో ఉపశమనం.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పొదుపుధనం ముందుగా గ్రహిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. అయినవారితో సంభాషిస్తుంటారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అందరితోనూ సఖ్యతగా మెలగండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీ కరిస్తారు. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పి దాలను సరిదిద్దుకోండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. కొందరి రాక ఇబ్బంది కలిగి స్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టు కోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ధనలాభం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపు తారు. ఒంటెద్దు పోకడ తగదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్తసమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఒకరి వద్ద మరొకరి గురించి ప్రస్తావన తగదు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. అవివాహితులు శుభవార్త వింటారు.
Updated Date - Nov 16 , 2025 | 07:19 AM