Mauni Amavasya: మౌని అమావాస్య రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?
ABN, Publish Date - Jan 20 , 2025 | 06:33 PM
Mauni Amavasya: రానున్నది మౌని అమావాస్య. అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఈ రోజు శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలుంటాయి.
మౌని అమావాస్య 2025: పుష్య మాసం మరికొద్ది రోజులతో ముగియనుంది. ఇంకా చెప్పాలంటే జనవరి 29వ తేదీతో అంటే.. మౌని అమావాస్యతో ముగియనుంది. ఈ అమావాస్య అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజున.. శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీలక్ష్మీని పూజిస్తారు. మరి ఈ వారిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతోపాటు కుటుంబ శ్రేయస్సు కలుగుతోంది. మోక్షాన్ని సైతం పొందుతారు. ఈ రోజు నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మ సైతం సంతృప్తి చెందుతోంది. పూర్వీకులకు తర్పణం వదులుతారు. పిండదానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తోంది. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల.. సమాజంలో గౌరవంతోపాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే పలు శుభకార్యాలు కూడా జరుపుతారు. మరి అలాంటి రోజు ఏం చేయాలి..ఏం చేయకూడదంటే..?
మౌని అమావాస్య.. జనవరి 28వ తేదీ రాత్రి 7.35 గంటలకు ప్రారంభమవుతోంది. ఇది ఆ మరునాడు అంటే.. జనవరి 29వ తేదీ 6.05 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మౌని అమావాస్య జరుపుకోనున్నారు. ఈ రోజున రెండవ మహా కుంభ అమృత స్నానం సైతం పలువురు ఆచరిస్తారు.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
మౌని అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున, శ్రీమహావిష్ణువు, లక్ష్మి తల్లిని పూజించడం మరియు స్నానం చేయడంతో పాటు, పూర్వీకుల తర్పణం మరియు పిండదానం కూడా చేస్తారు. ఈ రోజున పిండదానం మరియు తర్పణం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. మౌని అమావాస్య ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది.
Also Read: నాగ సాధువులు.. రహస్యాలు
Also Read: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం
ఇంతకీ ఈ రోజు ఏం చేయాలంటే..
ఈ రోజు..తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి.
శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీలక్ష్మీదేవిని పూజించండి. అలాగే గంగామాతను సైతం భక్తి శ్రద్ధలతో పూజించండి. అదే విధంగా సూర్యదేవుడిని కూడా ఆరాధిస్తే మంచిది
ఇక ఈ రోజు మౌన వ్రతం పాటించాలి. ఈ రోజు ఈ వ్రతం పాటించడం వల్ల పలు ప్రయోజనాలు సమకూరుతాయి. వీటి వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయి. ఈ రోజు సాయంత్రం.. సంధ్యా సమయంలో ఇంట్లో తులసి కోట ముందు అవు నెయ్యితో దీపం వెలిగించాలి.
'ఓం ప్రీత్ దేవతయే నమః' అని జపం చేయాలి. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి.
ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే శాఖహారమే తీసుకోవాలి.
Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
మౌని అమావాస్య రోజు ఏమి చేయకూడదంటే..?
మాంసాహరం ముట్టుకొకూడదు.
మద్యం సైతం సేవించవద్దు.
ఎవరితోనూ ఘర్షన పడవద్దు.
అబద్దాలు సైతం చెప్పకూడదు.
ఈ రోజు త్వరగా నిద్రకు ఉపక్రమించాలి.
For Devotional News And Telugu News
Updated Date - Jan 20 , 2025 | 06:33 PM