Share News

Maha Kumbh Mela- Naga Sadhu: నాగ సాధువులు.. రహస్యాలు

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:47 PM

Maha Kumbh Mela- Naga Sadhu: పొడవైన జట్టుతోపాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు. గడ్డ కట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలు పొగు సైతం ఉండదు. అయితే నాగ సాధువుగా మారలంటే.. ఇన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా?

Maha Kumbh Mela- Naga Sadhu: నాగ సాధువులు.. రహస్యాలు
Naga Sadhu in maha kumbamela

ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళకు హాజరవుతోన్నారు. అలాగే లక్షలాది మంది నాగ సాధువులు సైతం ఈ మహాకుంభ మేళలకు తరలి వస్తున్నారు. వీరు పొడవాటి జుట్టుతోపాటు భారీ గడ్డం, మీసాలతో ఈ మహా కుంభమేళకు పొటెత్తుతోన్నారు. అయితే నాగ సాధువులు.. తమ జుట్టును కత్తిరించుకోరు ఎందుకు? దీని వెనుక ఏమైనా రహ్యసం ఉందా? అంటే.. వీరు.. జుట్టు కత్తిరించుకోరు. దీంతో వారు ప్రాపంచిక బంధాలు, కోరికలతోపాటు భౌతిక సుఖాలను సైతం వదులుకొన్నారని సూచిస్తుంది. అతని సాధనతోపాటు తపస్సులో భాగం వీటిని పెంచుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. తల, గెడ్డం వెంట్రుకలు పెరగడం.. వారి ఆధ్యాత్మిక శక్తిని సంరక్షించడంలో సహాయ పడుతుంది. ఇది ధ్యానంతోపాటు యోగాలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

అంతేకాదు.. జుట్టుతోపాటు గడ్డం పెరగడం అనేది ప్రకృతితో వారి మమేకమైన తీరుతోపాటు జీవితం యొక్క సరళతను కూడా సూచిస్తుంది. నాగ సాధువులు తమ జుట్టును దువ్వుకోరు, తలస్నానం చేయరు. నూనె సైతం పెట్టరు. అలా వదిలేస్తారు. దీంతో శివుడి ఎలా అయితే తన జుట్టును వదిలేస్తారో.. అలాగే వీరు సైతం వదిలేస్తారు.


Kumbhamela03.jpg

ఇక శివుడిని 'జటాధారి' అని కూడా పిలుస్తుంటారు. కాబట్టి ఇది శివుని పట్ల వారి భక్తితోపాటు సాధనకు సంకేతంగా భావిస్తారు. ఇక నాగ సాధువులు శివుడిని పూజిస్తారు, అందుకే వారు శివుడిని సంతోషంగా ఉంచడానికి ఇలా చేస్తారని కూడా పలువురు బలంగా నమ్ముతారు. కొంతమంది నాగ సాధువులు తమ జుట్టు కత్తిరించుకుంటే దేవుడు తమపై కోపగించుకుంటాడని అంటుంటారు. దీని వల్ల తమ భక్తి అసంపూర్ణంగా మిగిలి పోతుందని భావిస్తారు. దీంతో వారు ఏ తపస్సు చేసినా దాని ఫలం లభించదు. అందుకే నాగాలు ఎప్పుడూ జుట్టు మాత్రం కత్తిరించుకోరు.

Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు


నాగ సాధువుగా మారడానికి పలు దశలు

KumbhaMela-02.jpg

నాగ సాధువుగా మారే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. అంతేకాదు చాలా కష్టాలతో కూడుకున్నది. తొలుత అన్వేషకులు విభాగంలో చేరడానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది. నాగ సాధువు కావడానికి.. సాధకులు మూడు దశలను దాటాల్సి ఉంది. అందులో తొలి దశ మహా పురుషుడు, రెండవ దశ అవధూతుడు, మూడవ దశ దిగంబరుడు. తుది తీర్మానం తీసుకునే వరకు.. ఇంకా చెప్పాలంటే.. నాగ సాధువులుగా మారే వరకు కొత్త సభ్యులు లుంగీలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కుంభమేళాలో ఆఖరి ప్రతిజ్ఞ చేసిన అనంతరం.. లుంగిని విడిచిపెట్టి.. తన జీవితాంతం దిగంబరుడిగా ఉండాల్సి వస్తోంది. ఒకరు నాగ సాధువు అయినప్పుడు, అతని జుట్టు మొదటి సారి కత్తిరించబడుతుంది. దీని తర్వాత అతను తన జీవితాంతం జుట్టు కత్తిరించకుండానే ఉంటాడు.

Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..


నాగ సాధువులు ఎన్ని రకాలంటే..

kumbamela.jpg

ప్రయాగలో జరిగిన కుంభమేళ నుంచి ప్రారంభించ బడిన నాగ సాధువు రాజేశ్వర్ అని పిలువబడతాడు. ఎందుకంటే అతను త్యజించిన తర్వాత రాజయోగాన్ని పొందాలని కోరుకుంటాడు. ఉజ్జయిని కుంభమేళ నుంచి దీక్ష తీసుకునే సాధువులను ఖూనీ నాగులంటారు. వారి స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది. హరిద్వార్‌లో దీక్ష తీసుకునే నాగ సాధువులను బర్ఫానీలని పిలుస్తారు. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. నాసిక్ కుంభంలో దీక్ష తీసుకునే సాధువును ఖిచ్డీ నాగ అంటారు. వీరికి కూడా స్థిరమైన స్వభావం లేదని చెబుతారు.

For Devotional News And Telugu News

Updated Date - Jan 20 , 2025 | 04:47 PM