Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:58 PM
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో అంటే 2017లో ఆయన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన రెండు పుస్తకాలపై చేయి ఉంచి ప్రమాణం చేశారు.
మరికొన్ని గంటల్లో అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఒకరు తన కుడి చేతిని పైకెత్తి.. తన ఎడమ చేతిని బైబిల్‌పై ఉంచి ప్రమాణం చేస్తారు. అయితే దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బైబిల్‌పై ఎందుకు చేయి వేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ సంప్రదాయం ఎందుకు.. ఎలా ప్రారంభమైంది? దీని వెనుక ఏమైనా నియమం ఉందా? లేకుంటే చారిత్రక ప్రాముఖ్యత ఉందా? అంటే..
వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. 1789లో యునైటెడ్ స్టేట్స్ తొలి దేశాధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో.. వేడుక నిర్వాహకులు బైబిల్ తీసుకురావడం మర్చిపోయారు, దీంతో ఆయన మసోనిక్ లాడ్జ్ నుండి ఓ బైబిల్ తీసుకున్నారు. జార్జి వాషింగ్టన్ ఉపయోగించిన బైబిల్‌తో ఇతర దేశాధ్యక్షులు జిమ్మీ కార్టర్, డ్వైట్ డి ఐసెన్ హోవర్, వారెన్ జి.హార్డింగ్, జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక ప్రమాణ స్వీకారం అనంతరం బైబిల్‌ను ముద్దు పెట్టుకోవడంలో వాషింగ్టన్ నుంచి ప్రారంభమైంది. 1853 వరకు ఆ దేశాధ్యక్షులు.. దీనిని అనుసరించారు. కానీ ఫ్రాంక్లిన్ పియర్స్ మాత్రం బైబిల్‌ను ముద్దు పెట్టుకోవడానికి బదులుగా తన ఎడమ చేతిని దానిపై ఉంచడాన్ని ప్రారంభించారు. దీంతో బైబిల్‌ను ముద్దు పెట్టుకొనే ఆచారాన్ని ఆయన నిలిపివేసినట్లు అయింది.
యూఎస్ ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్.. 19వ శతాబ్దం నాటి నుంచి తన కుటుంబంలో ఉన్న బైబిల్‌తో ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే. ఇక రెండో సారి దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే గతంలో ఆయన ఓసారి దేశాధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. 2019లో ట్రంప్ తొలి సారి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన రెండు బైబిళ్లను ఉపయోగించారు. వాటిలో ఒకటి కన్నతల్లి ట్రంప్‌కు అందజేసింది. కాగా మరొకటి లింకన్ తన తొలి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్‌ను ఆయన వినియోగించారు. ఇక యూఎస్ దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పలువురు బైబిల్‌ను సైతం వినియోగించక పోవడం గమనార్హం.
For International News And Telugu News