ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deepavali: భారత్‌తో పాటు దీపావళి జరుపుకునే ఇతర దేశాలు ఇవే..

ABN, Publish Date - Oct 19 , 2025 | 02:10 PM

దీపావళ పంగడను భారత్‌ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Deepavali Celebrations : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా దీపావళి పండగ చేసుకుంటారు. అయితే ఈ పండగ భారత్‌ ఒక్క దేశంలోనే జరుపుకుంటారా? లేకుంటే ఇతర దేశాల్లో సైతం చేసుకుంటారా? అంటే వివిధ దేశాల్లో పలు పేర్లతో ఈ పండగ చేసుకుంటారు. ఈ పండగ వేళ.. దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచడంతోపాటు లక్ష్మీ, గణేశ్‌లను భక్తి శ్రద్థలతో పూజిస్తారు. అంతేకాదు ఐదు రోజుల పాటు ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ధన త్రయోదశితో ప్రారంభమై.. నరక చతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్‌లతో ఈ పండగ ముగుస్తుంది. ఈ దీపావళిని భారత్‌లోనే కాకుండా వివిధ దేశాల్లో సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

శ్రీలంక..

ఈ దేశంలో ముఖ్యంగా తమిళన సమాజం దీపావళిని జరుపుకుంటుంది. ఈ పండగ వేళ దీపాలు వెలిగిస్తారు. సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు.

మారిషస్..

ఈ దేశంలో భారతీయులు అధికంగా ఉంటారు. వీరు సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దీపావళికి కొన్ని వారాల ముందు నుంచి ఇక్కడ వేడుకలు ప్రారంభమవుతాయి.

సింగపూర్‌లో..

ఈ దేశంలో లిటిల్ ఇండియా ప్రాంతం దీపావళి సమయంలో లైట్లు, అలంకరణతో మెరిసిపోతుంది. ఈ రోజు వీరంతా లక్ష్మీ, గణపతి పూజను నిర్వహిస్తారు.

మలేషియాలో..

ఈ దేశంలో ఈ పండగను హరి దీపావళి అని పిలుస్తారు. ప్రజలు ఉదయాన్నే నూనెతో స్నానం చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఈ పూజలు చేస్తారు.

నేపాల్‌లో..

ఈ దేశంలో దీపావళిని.. తిహార్ అని అంటారు. ఇక్కడ ఐదు రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది. మరి ముఖ్యంగా మూగ జీవాలను ప్రత్యేకంగా పూజిస్తారు.

ఫిజీ-కరేబియన్ దేశాలతోపాటు..

ఫిజీ దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది భారతీయులు ఉన్నారు. వీరంతా దీపావళిని పెద్ద పండగగా జరుపుకుంటారు. ఇళ్లను రకరకాల లైట్లతో అందంగా అలంకరిస్తారు. బాణ సంచాను కాలుస్తారు. ఇక కరేబియన్ దేశాలైన ట్రినిడాడ్, టొబాగో, గయానాల్లో సైతం దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే బ్రిటన్, అమెరికా, కెనడా తదితర పాశ్చాత్య దేశాల్లో కూడా భారీ సంఖ్యలో భారతీయులున్నారు. వీరంతా పెద్ద సంఖ్యలో ఈ పండగను జరుపుకోనున్నారు. స్థానిక ప్రభుత్వాలు సైతం ఈ పండగ వేళ.. భారతీయులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాయి.

Updated Date - Oct 19 , 2025 | 10:24 PM