ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secrates Behind Batukamma Festival: బతుకమ్మ వెనుక ఇంత ఆరోగ్యం ఉందా..?

ABN, Publish Date - Sep 21 , 2025 | 01:27 PM

బతుకమ్మ అంటే బతుకు కోరేది. ఆ పండగ రోజు ప్రారంభమైంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ పండగ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో జరుపుకుంటారు.

భారతీయ సంప్రదాయంలో జరుపుకునే పండగలన్నీ దాదాపుగా ప్రకృతితో మమేకమై ఉంటాయి. పండగ అయినా.. శుభకార్యం అయినా.. ఇంటి గుమ్మానికి మామిడాకులు కడతారు. దీని వెనుక సైతం మనిషి ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచన ఉంటుంది. వినాయక చవితి జరుపుకుంటాం. ఈ సందర్భంగా నేరేడు, మారేడు, మామిడి ఆకులతోపాటు పలు రకాల ఆకులను వినాయకుని పూజలో వినియోగిస్తారు. అదే విధంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ.

మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండగ మహాలయ పక్ష అమావాస్య అంటే (సెప్టెంబర్ 21వ తేదీ).. ఈ రోజు ప్రారంభమైంది. ఈ పండగ సందర్భంగా వినియోగించే వాటి వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. అదీకాక వర్షా కాలం ముగిసి.. శరత్కాలం ప్రారంభంలో ఈ పండగ ప్రారంభం కానుంది.

ఇక వర్షా కాలం అంటేనే.. వివిధ అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటి భారీన పడిన వారు.. త్వరగా కొలుకొనేందుకు ఈ బతుకమ్మ పండగ వేళ వినియోగించే పూలు, ఆకులు రక్షిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇక శరద్రుతువులో బంతి, చామంతి, బీర, కాకర, గుమ్మడి, తామర, సీతజడలు, దోస, వాము, తంగేడు, గునుగు, మందా, అల్లి తదితర పూలు వికసిస్తాయి. వీటితో బతుకమ్ము అందంగా పేర్చుతారు.

తంగేడు: ఈ చెట్టుకు సంబంధించిన పువ్వులు, ఆకుల రసం శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తోంది. మరి ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. దీని ఆకులు పువ్వుల పొడి.. చర్మ వ్యాధులను తగ్గించేందుకు సహయపడుతుంది.

కాకరపూలు: షుగర్ సమస్యతో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం. ప్రతి యాంటి బయోటిక్ మందుల తయారీలో ఈ కాకర పూల తైలాన్ని వినియోగిస్తారు. అంతే కాదు.. ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

గుమ్మడి: ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గుమ్మడి పువ్వుల్లో కాల్షియం, భాస్వరం, విటమిన్లు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి. వివిధ రకాల వంటకాల్లో ఈ పువ్వులను వినియోగిస్తారు.

గునుగు: ఇది సైతం షుగర్‌ను నియంత్రిస్తుంది. ముక్కు నుంచి రక్త స్రావం తగ్గించడానికి ఆయుర్వేద వైద్యంలో దీనిని వినియోగిస్తారు. అలాగే నోట్ల పుండ్లు ఏర్పడితే ఈ గునుగు పూలను వినియోగిస్తారు.

చామంతి: ఈ పూలతో టీ చేసి రాత్రి వేళ తీసుకుంటే జీర్ణక్రియతోపాటు రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రాత్రి కూడా మంచి నిద్ర పడుతుంది.

బంతిపూలు: ఈ పూల తైలం రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. దీనిని ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తారు. కడుపులో నులి పురుగుల వ్యాధి నివారణకు దీనిని వినియోగిస్తారు.

వీటిని కూడా చదవండి..

బతుకమ్మ పండగ షురూ.. తొలి రోజు విశిష్టత

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..

For More Devotional News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 01:28 PM