ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిమాన్వితుడు అయినవిల్లి వినాయకుడు

ABN, Publish Date - Aug 24 , 2025 | 10:18 AM

కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.

వృద్ధ గౌతమి (గోదావరి నది) తీరాన, శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం అయినవిల్లి వినాయకుడి ఆలయం.

కృత యుగంలో దక్షప్రజాపతి యజ్ఞం చేపట్టే ముందు

ఈ స్వామినే అర్చించారని ప్రతీతి. నేటికీ అన్ని రంగాలకు

చె ందిన ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఏ పని ప్రారంభించాలన్నా మొదట అయినవిల్లి వినాయకుడి ఆశీర్వచనం తీసుకున్నాకే ముందడుగు వేయడం స్వామి మహిమకు నిదర్శనం

కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.

14వ శతాబ్దంలో శంకరభట్టు సంస్కృతంలో రాసిన శ్రీపాదవల్లభ చరిత్రలోని ఐదవ అధ్యాయంలో ఈ క్షేత్ర ప్రస్థావన ఉంది. దాని ప్రకారం క్రీ.శ. 1320లో జన్మించిన శ్రీపాదవల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు అయినవిల్లిలో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరిపారు. శాస్త్ర ప్రకారం చివరిరోజు హోమంలో వేసే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండముతో అందుకోవాలని అక్కడి పండితులు చర్చించారట.

వినాయకుడు వారి కోరికను మన్నించి యజ్ఞాంతంలో అదేవిధంగా దర్శనమిచ్చి కొద్దికాలంలోనే భాద్రపద శుద్ధ చవితినాడు దత్తావధారుడై శ్రీపాదవల్లభుడిగా అవతరిస్తానని వర మిచ్చాడట. అదే అధ్యాయంలో ముగ్గురు నాస్తికులు గణపతిని అవహేళన చేస్తే, పర్యవసానంగా తర్వాత జన్మలో వాళ్లు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుట్టినట్టు చెప్పారు. ఈ ముగ్గురూ ఖాళీ స్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు బావిలో గణపతి దొరికాడట. ఆయనే కాణిపాక వినాయకుడిగా ప్రసిద్ధి చెందినట్టు రాసి ఉంది. దీనిని బట్టి కాణిపాక వినాయకుని కన్నా ఈ వినాయకుడు ప్రాచీనుడని తెలుస్తోంది.

గరిక, నారికేళ ప్రియుడు

అయినవిల్లి గణేశుడు గరిక, నారికేళ ప్రియుడు. ఇక్కడ స్వామిని గరికతో విశేషంగా పూజిస్తారు. భక్తులు తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకుని వెళ్లి అది తీరగానే మళ్లీ వినాయకుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఏటా మొక్కులు తీర్చుకునే భక్తులు 30 లక్షల కొబ్బరికాయలు కొడతారంటే స్వామివారి మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. భక్తులు రూ.300 చెల్లించి లక్ష్మీగణపతి హోమంలో పాల్గొనవచ్చు. మామూలుగా అయితే ఈ హోమానికి కొన్ని వేల రూపాయల ఖర్చవుతుంది.

ఆలయంలో నిత్యం ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాసాభిషేకాలతోపాటు పుస్తక పూజ, అక్షరాభ్యాసం తదితర పూజలు నిర్వహిస్తూంటారు. ప్రతి నెలా ఉభయ చవితి తిథులు, దశమి ఏకాదశుల్లో విశేషార్చనలు చేస్తారు. సంకటహర చతుర్ధినాడు ప్రత్యేక గరిక పూజ నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా వార్షిక పరీక్షలకు ముందు లక్ష పెన్నులతో పూజ నిర్వహించి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. స్వామివారు కోర్కెలు తీర్చే వినాయ కుడిగా పేరొందడంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధికారులు, రాజకీయనేతలు,

న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకోవడం నిత్యకృత్యంగా మారింది. రాజకీయ నేతలు తమ నామినేషన్‌ పత్రాలకు ఇక్కడే పూజలు చేయించి వాటిని సమర్పించడానికి ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ ముఖ్య కేంద్రమైన అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం, వాడపాలెం మీదుగా 54 కిలోమీటర్లు ప్రయాణించి అయినవిల్లి చేరుకోవచ్చు. కాకినాడ నుంచి అయితే అమలాపురం మీదుగా ఆలయం చేరుకోవచ్చు.

- ఆంధ్రజ్యోతి, అయినవిల్లి

Updated Date - Aug 24 , 2025 | 10:18 AM