ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lunar Eclipse September 2025: చంద్రగ్రహణం వేళ.. ఈ జాగ్రత్తలు పాటించండి..

ABN, Publish Date - Sep 05 , 2025 | 04:00 PM

జోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం మానసిక స్థితి, కెరీర్‌తోపాటు ఆరోగ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతారు. అయితే ఒక్కో రాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం వేర్వేరుగా ఉంటుందని అంటారు.

భాద్రపద పౌర్ణమి రోజున.. అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో.. కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ రోజున చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దాంతో దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఆదివారం రాత్రి 9.56 గంటల నుంచి రాత్రి 1.26 గంటల వరకు ఈ గ్రహణం ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. మానసిక స్థితి, కెరీర్‌తోపాటు ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే ఒక్కో రాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం వేర్వేరుగా ఉంటుందని అంటారు. ఈ గ్రహణ ప్రభావం కొంత మందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే.. మరికొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుందని పేర్కొంటారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రతలు తెలుసుకుందాం. అదే విధంగా ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని సైతం తెలుసుకుందాం.

సాధారణ ప్రభావాలు ఎలా ఉంటాయి..

చాలా మందికి ఈ గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరత్వం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న వారిపై ఈ ప్రభావం ఉంటుందని జోతిష్య పండితులు చెబుతున్నారు. కొంత మందికి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. మనస్సు అలజడికి గురయ్యే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత సంబంధాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దాంతో కుటుంబ, వ్యాపార సంబంధాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ మంత్రాలు జపించాలి..

గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నమ: శివాయ, గాయత్రీ తదితర మంత్రాలు జపించాల్సి ఉంటుంది. దీంతో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు. అలాగే ఆహార నియమాలు సైతం పాటించాలని అంటున్నారు. గ్రహణం ప్రారంభానికి ముందు.. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. ఇక మనస్సు ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, దైవాన్ని తలుచుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఇక ఈ గ్రహణ సమయంలో గర్బిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. వీరు గ్రహణ సమయంలో కదల కుండా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2025 | 04:07 PM