ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రియురాలిని హతమార్చి.. యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jun 04 , 2025 | 10:59 AM

ఓ యువకుడు.. ప్రియురాలిని హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం పెరంబూరులో జరిగింది. ఆకాష్‌, అభినయ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే.. ఏమైందో ఏమోగాని అభినయ రక్తపు మడుగులో పడి ఉండగా ఆకాష్ ఉరేసుకుని మృతి చెందాడు.

- పెరంబూరులో దారుణం

చెన్నై: స్థానిక పెరంబూరు రాజీవ్‌గాంధీ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగిన ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రియుడే ఆ యువతిని హతమార్చి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి... విల్లుపురం జిల్లా తిరువెన్నైనల్లూరు ప్రాంతానికి చెందిన ఆకాష్‌ (19)బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన అభినయ (19) ఆకాష్‌ చదువుతున్న కళాశాలలోనే చదువుతోంది.


ఒకే కళాశాలలో చదువుతుండటంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల క్రితం వారిద్దరూ పెరంబూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారం రోజులపాటు ఏ గొడవ లేకుండా సంతోషంగా గడిపిన వారి మధ్య ఉన్నట్టుండి మనస్పర్థలు ఏర్పడయ్యాయి. తరచూ రాత్రిపూట గొడవపడుతుండేవారు. ఆ విధంగానే సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. కాసేపటికి శబ్దాలు ఆగిపోయాయి. చుట్టుపక్కల వారు అనుమానంతో కిటికీ నుండి లోపలికి చూడగా ఆకాష్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు.


వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికెళ్లి చూడగా, అభినయ శరీరంపై గాయాలతో రక్తపుమడుగులో పడి వుంది. ఆకాష్‌ ఉరేసుకుని మృతి చెందాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.. ఐసీఎఫ్‌ పోలీసుల ప్రాథమిక విచారణలో అభినయపై కత్తితో దాడి చేసిన అనంతరం ఆకాష్‌ ఉరేసుకున్నట్లు తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 10:59 AM