ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Love Affair: మరిదితో ఎఫైర్.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన మహిళ.. అడ్డంగా దొరికిందిలా..

ABN, Publish Date - Jul 19 , 2025 | 01:50 PM

Love Affair: కరన్, సుష్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఈ నేపథ్యంలోనే కరన్‌కు తమ్ముడి వరుసయ్యే రాహుల్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.

Love Affair

వివాహేతర సంబంధాల నేపథ్యంలో అమాయక ప్రాణాలు బలి అవుతున్నాయి. నేరం చేస్తే దొరికి పోతామని, శిక్షతప్పదని తెలిసి కూడా కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ మహిళ మరిదితో ఎఫైర్ పెట్టుకుంది. ఇందుకు భర్త అడ్డుగా ఉన్నాడని పక్కాగా ప్లాన్ చేసి మరీ చంపేసింది. అయితే, ఆ ఫ్లాన్ వర్కవుట్ కాలేదు. ఆమె, ఆమె ప్రియుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన కరన్ దేవ్, సుష్మిత భార్యాభర్తలు. పెళ్లయిన కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. కరన్, సుష్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఈ నేపథ్యంలోనే కరన్‌కు తమ్ముడి వరుసయ్యే రాహుల్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. వీరిద్దరూ తరచుగా కలుసుకునే వారు. కాల్స్ మాట్లాడుకునే వారు.. చాటింగ్ చేసుకునే వారు. సుష్మిత, రాహుల్‌తో ఉన్నపుడు సంతోషంగా ఉండేది.

భర్త మాత్రం ఆమెను సరిగా చూసుకునే వాడు కాదు. కార్వాచౌత్‌కు ఒక రోజు ముందు కూడా ఆమెపై దాడి చేశాడు. ఆమె భర్త వేధింపులు భరించలేకపోయింది. ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్ వేసింది. జులై 13వ తేదీన కరన్ తినే ఆహారంలో 15 నిద్రమాత్రలు కలిపింది. నిద్ర మాత్రల ఓవర్ డోస్ కారణంగా కరన్ చనిపోయాడు. అతడు చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక.. శవానికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. కరన్ మరణాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

తర్వాత శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరన్‌ను పరీక్షించిన వైద్యులు చనిపోయాడని చెప్పారు. కరన్ మరణానికి కారణం ఏంటో తెలిసిపోయింది కాబట్టి పోస్టుమార్టం అవసరం లేదని అన్నారు. అయితే, పోలీసులు మాత్రం పట్టుబట్టి పోస్టుమార్టం చేయించారు. మూడు రోజుల తర్వాత కరన్ తమ్ముడు కునాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. సుష్మిత, రాహుల్ కలిసి తన అన్నను చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారిద్దరు చేసుకున్న చాటింగ్ బయటపెట్టాడు. అందులో మర్డర్ ప్లాన్ గురించి కూడా ఉంది. దీంతో పోలీసులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటపడింది. సుష్మిత, రాహుల్‌లు ఇప్పుడు జైలులో చిప్పకూడు తింటున్నారు.

ఇవి కూడా చదవండి

తీవ్ర విషాదం.. చీర కొంగు ప్రాణం తీసింది..

రైల్వే స్టేషన్‌లో దారుణం.. మహిళపై లైంగిక దాడికి యత్నించి..

Updated Date - Jul 19 , 2025 | 01:57 PM