Diva Station Shocker: రైల్వే స్టేషన్‌లో దారుణం.. మహిళపై లైంగిక దాడికి యత్నించి..
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:14 PM
Diva Station Shocker: ప్లాట్ ఫామ్ నెంబర్ 5,6 దగ్గర నుంచి హేమకు అరుపులు వినిపించాయి. హేమతో పాటు ఆమెతో పని చేస్తున్న వారు అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్లారు. గుర్తు తెలియని ఓ మహిళ రాజన్ శివ్‌నారాయణ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడుతూ ఉంది.
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మృగంలా మారి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. తనకు సహకరించటం లేదన్న కోపంతో ఆమెను రైలు కింద తోసేశాడు. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. తులసీ దాస్ హేమ కమ్దీ అనే మహిళ దివా రైల్వే స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్లాట్ ఫామ్ నెంబర్ 7,8 దగ్గర ఆమె క్లీనింగ్ చేస్తూ ఉంది.
ఈ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ నెంబర్ 5,6 దగ్గర నుంచి హేమకు అరుపులు వినిపించాయి. హేమతో పాటు ఆమెతో పని చేస్తున్న వారు అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్లారు. గుర్తు తెలియని ఓ మహిళ రాజన్ శివ్‌నారాయణ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడుతూ ఉంది. ఆ మహిళ రాజన్ నుంచి తప్పించుకుని కల్యాణ్ వైపు పరిగెత్తింది. అతడు ఆమెను వెంబడించి రెండు చేతులతో గొంతుపట్టుకున్నాడు. ఆమె అతడినుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అటువైపు గూడ్స్ రైలు వచ్చింది.
రాజన్ ఆ మహిళను రైలుకిందకు తోసి చంపేశాడు. ఆ వెంటనే అక్కడినుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సాగర్ షిండే అతడ్ని పట్టుకున్నాడు. తర్వాత స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజన్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు జులై 22 వరకు అతడికి పోలీస్ కస్టడీ విధించింది. కాగా, నిందితుడు, మృతురాలికి ఎలాంటి సంబంధం లేదని.. ఒకరికి ఒకరు తెలియను కూడా తెలీదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజన్ తన కోరిక తీర్చుకునే నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.
ఇవి కూడా చదవండి
హెచ్‌ఆర్‌తో ఎఫైర్.. చిక్కుల్లో పడ్డ కంపెనీ సీఈఓ
వీధిలో బీభత్సం సృష్టించిన వరద.. నీటిలో కొట్టుకుపోయిన భక్తుడ్ని..