Viral Video: వీధిలో బీభత్సం సృష్టించిన వరద.. నీటిలో కొట్టుకుపోయిన భక్తుడ్ని..
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:46 AM
Viral Video: ఆ వ్యక్తి వీధిలో ప్రవహిస్తున్న నీటిలో పడ్డాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడికి సాయం చేద్దామని షాపుల వాళ్లు చాలా మంది ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. అతడు చాలా దూరం నీటిలో కొట్టుకుపోయాడు.
గత రెండు, మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. బిజీ రోడ్లు సైతం నదులను తలపిస్తున్నాయి. నిన్న రాజస్థాన్‌లోని అజ్మిర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ఓ రోడ్డుపై వరద ప్రవాహం మొదలైంది. దర్గాకు వచ్చిన ఓ భక్తుడు ఆ నీటిలో పడ్డాడు. నదిలో పడి కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోయాడు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ఓ వ్యక్తి అజ్మిర్‌లోని ‘దర్గా ఆఫ్ క్వాజా గరిబ్ నవాజ్’కు వెళ్లాడు. దర్శనం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో భారీ వర్షం కురిసింది. అక్కడి వీధుల్లో వరద ప్రవాహం మొదలైంది. ఆ వ్యక్తి వీధిలో ప్రవహిస్తున్న నీటిలో పడ్డాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడికి సాయం చేద్దామని షాపుల వాళ్లు చాలా మంది ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. అతడు చాలా దూరం నీటిలో కొట్టుకుపోయాడు.
కొంతమంది సాయం చేయటం మానేసి వీడియోలు తీయటం మొదలెట్టారు. ఇంతలో ఓ హోటల్ దగ్గర ఉన్న ఓ వ్యక్తి .. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి చెయ్యి పట్టుకుని కాపాడాడు. లేదంటే అతడు వరదలో కొట్టుకుపోయి చనిపోయేవాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘అతడు వాటర్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది’.. ‘నదిలో కొట్టుకుపోతున్నా కూడా అతడు వాటర్ బాటిల్, క్యారీ బ్యాగ్‌ను వదిలిపెట్టలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వధువును కౌగిలించుకున్న ప్రియురాలు.. వరుడిపై ఎలా కసి తీర్చుకుందో చూస్తే..
ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ అసత్య ప్రచారం?