Share News

Astronomer CEO Andy Byron: హెచ్‌ఆర్‌తో ఎఫైర్.. చిక్కుల్లో పడ్డ కంపెనీ సీఈఓ

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:25 PM

Astronomer CEO Andy Byron: ఆండీ, క్రిస్టిన్ కాబోట్ కొద్దిరోజుల క్రితం బోస్టన్‌లో జరిగిన కోల్డ్ ప్లే కన్‌సర్ట్‌కు వెళ్లారు. అక్కడ అత్యంత చనువుగా కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రచ్చ మొదలైంది.

Astronomer CEO Andy Byron: హెచ్‌ఆర్‌తో ఎఫైర్.. చిక్కుల్లో పడ్డ కంపెనీ సీఈఓ
Astronomer CEO Andy Byron

లేడీ హెచ్‌ఆర్‌ చీఫ్‌తో ఎఫైర్ ఆస్ట్రానమర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ బైరన్‌ కొంపముంచింది. కంపెనీ యాజమాన్యం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆండీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆండీ, క్రిస్టిన్ కాబోట్ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. అంతేకాదు.. దర్యాప్తులో నిజానిజాలు తేలేవరకు విధులకు హాజరుకావద్దని ఆండీకి తేల్చి చెప్పింది. ఆండీని లీవ్ మీద ఇంటికి పంపించేసింది. కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ప్రాడెక్ట్ ఆఫీసర్ పెటె డీజాయ్ తాత్కాళిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.


ఈ మేరకు కంపెనీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టింది. రానున్న రోజుల్లో ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేస్తామని పేర్కొంది. మరో పోస్టులో .. ‘కంపెనీ ప్రారంభమైన నాటి నుంచి విలువలకు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉంది. అవే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మా నాయకులు ఉన్నత ప్రవర్తన, జవాబుదారీతనానికి ప్రతీకగా ఉండాలి. ఆండీ, క్రిస్టిక్ వివాదంపై దర్యాప్తు జరిపించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు.


అలైసా స్టోడార్డ్ ఆ ఈవెంట్‌లో లేదు. ఇతర ఉద్యోగులు కూడా ఆ వీడియోలో కనిపించలేదు. ఆండీ ఎలాంటి స్టే‌ట్‌మెంట్ ఇవ్వలేదు. అతడు స్టేట్‌మెంట్ ఇచ్చాడని వస్తున్న వార్తలన్నీతప్పు’ అని పేర్కొంది. కాగా, ఆండీ, క్రిస్టిన్ కాబోట్ కొద్దిరోజుల క్రితం బోస్టన్‌లో జరిగిన కోల్డ్ ప్లే కన్‌సర్ట్‌కు వెళ్లారు. అక్కడ అత్యంత చనువుగా కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య ఉండగానే ఆండీ ఎఫైర్ పెట్టుకోవటం.. ఇద్దరూ పబ్లిక్‌లో హగ్గులు చేసుకుంటూ దొరికిపోవటంతో రచ్చమొదలైంది.


ఇవి కూడా చదవండి

వీధిలో బీభత్సం సృష్టించిన వరద.. నీటిలో కొట్టుకుపోయిన భక్తుడ్ని..

ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ అసత్య ప్రచారం?

Updated Date - Jul 19 , 2025 | 12:29 PM