Flour Mill Accident: తీవ్ర విషాదం.. చీర కొంగు ప్రాణం తీసింది..
ABN , Publish Date - Jul 19 , 2025 | 08:52 AM
Flour Mill Accident: వాళ్లు తేరుకునే సరికే ఆమె ప్రాణాలు పోయాయి. శవం బెల్టుకు ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీనా శవాన్ని బెల్టునుంచి పక్కకు తీశారు.
ప్రాణం ఎప్పుడు.. ఎలా పోతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటి వరకు ఎంతో సంతోషంగా నవ్వుతూ, తుళ్లుతూ ఉన్న వారు కూడా.. ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవచ్చు. ఇందుకు కేరళలో జరిగిన తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. చీర కొంగు ఓ మహిళ ప్రాణం తీసింది. రైసు మిల్లులో పని చేస్తుండగా ప్రమాదం జరిగి ఆ మహిళ చనిపోయింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. వెంజరమూడుకు చెందిన 48 ఏళ్ల బీనా అనే మహిళ కరాటే పులిమఠ్ భగవతీ టెంపుల్ దగ్గరలో నివాసం ఉంటోంది.
ఆమె స్థానికంగా ఉండే ఓ రైస్ మిల్లులో గత కొన్నేళ్లుగా పని చేస్తోంది. రోజూ లాగే శుక్రవారం కూడా పనికి వెళ్లింది. రైసు మిల్లులో మిషిన్ దగ్గరగా పని చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మిషిన్ ఆఫ్ చేయడానికి వెళ్లింది. నడుస్తూ వెళుతూ ఓ చెక్కపై కాలు పెట్టింది. కాలు జారి కన్వేయర్ బెల్టు మీద చీర కొంగుపడింది. చీర కొంగు మెడకు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఓ ఇద్దరు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వేగానికి వాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు.
వాళ్లు తేరుకునే సరికే ఆమె ప్రాణాలు పోయాయి. శవం బెల్టుకు ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీనా శవాన్ని బెల్టునుంచి పక్కకు తీశారు. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బీనాకు కొంతకాల క్రితం రెండో పెళ్లి జరిగింది. ఆమెకు ప్రవీణ్, వీణా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీనా మృతితో కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. పిల్లలు తల్లిలేని వాళ్లు అయ్యారు.
ఇవి కూడా చదవండి
కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రీల్ చేయండి డబ్బు గెలవండి
కొన్ని సెకన్ల ముందే ప్రమాదాన్ని గ్రహించాయి.. ఠక్కున అక్కడినుంచి..