Share News

Digital India Reel: కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రీల్ చేయండి డబ్బు గెలవండి

ABN , Publish Date - Jul 19 , 2025 | 08:21 AM

Digital India Reel: ‘పదేళ్ల డిజిటల్ ప్రోగ్రెస్.. విశృంఖల అవకాశాలు’ అన్న శీర్షికతో పోటీ జరుగుతోంది. డిజిటల్ సర్వీసుల కారణంగా మీ జీవితం ఎలా మారింది. అది కూడా పాజిటివ్‌గా ఎలా మారిందన్న దానిపై ఓ వీడియో చేయాలి.

Digital India Reel: కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రీల్ చేయండి డబ్బు గెలవండి
Digital India Reel

రీల్స్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కాంపిటీషన్‌ను ప్రకటించింది. ఈ కాంపిటీషన్‌లో పాల్గొని విజయం సాధించిన వారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా.. క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది.


ఈ కాంపిటీషన్‌లో ఎలా పాల్గొనాలి..

‘పదేళ్ల డిజిటల్ ప్రోగ్రెస్.. విశృంఖల అవకాశాలు’ అన్న శీర్షికతో పోటీ జరుగుతోంది. డిజిటల్ సర్వీసుల కారణంగా మీ జీవితం ఎలా మారింది. అది కూడా పాజిటివ్‌గా ఎలా మారిందన్న దానిపై ఓ వీడియో చేయాలి. డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా పొందుతున్న ప్రభుత్వ సేవలు, ఆన్ లైన్ హెల్త్ కేర్, డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల లాభాలు, భీమ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్ వల్ల ఉపయోగాలు, UMANG, డీజీలాకర్, ఈహాస్పిటల్ వంటి వాటితో మీ అనుభవాలపై వీడియో చేయాలి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై వీడియో చేయొచ్చు.


తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషలోనైనా వీడియో చేయొచ్చు. వీలైతే సబ్ టైటిల్స్ పెట్టండి. వీడియో యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ ఫార్మాట్‌లో ఉండాలి. అవుట్ పుట్ క్వాలిటీ ఎమ్‌పీ4 హెచ్‌డీ అయిఉండాలి. వీడియో చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ యాక్సెస్ చేసేలా ఉండేలా.. ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. MyGov.in.లో లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేసుకోవాలి. తర్వాత లింక్ ద్వారా వీడియో సబ్‌మిట్ చేయాలి.


చివరి తేదీ.. బహుమతుల వివరాలు..

ఈ కాంపిటీషన్‌లో గెలిచిన 10 మందికి ఒక్కోరికి 15వేల రూపాయలు వస్తాయి. మరో 25 మందికి 10 వేల రూపాయల చొప్పున వస్తాయి. మరో 50 మందికి 5వేల రూపాయల చొప్పున వస్తాయి. ఈ కాంపిటీషన్‌లో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 1, రాత్రి 11.45 గంటల కంతా తమ ఎంట్రీని సబ్‌మిట్ చేయాలి.


ఇవి కూడా చదవండి

కొన్ని సెకన్ల ముందే ప్రమాదాన్ని గ్రహించాయి.. ఠక్కున అక్కడినుంచి..

సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

Updated Date - Jul 19 , 2025 | 08:29 AM