ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:58 AM

అనకాపుత్తూరు సమీపం మదురవాయల్‌ బైపా్‌సరోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడవాక్కంలో పద్మనాభన్‌ (60), ఇంద్రాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి దీపికా (23) అనే కుమార్తె ఉంది.

చెన్నై: అనకాపుత్తూరు సమీపం మదురవాయల్‌ బైపా్‌సరోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడవాక్కంలో పద్మనాభన్‌ (60), ఇంద్రాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి దీపికా (23) అనే కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం కొడుంగయూరుకు చెందిన నితీష్‌ అనే యువకుడితో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం దీపిక(Deepika) ఎనిమిది నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అంబత్తూరులోని బంధువు ఇంటి వేడుకల్లో పాల్గొనేందుకు పద్మనాభన్‌, ఇంద్రాణి, దీపిక వెళ్ళారు.

మంగళవారం వేకువజామును ఈ ముగ్గురూ అద్దె కారులో మేడవాక్కంకు బయలుదేరారు. అనకాపుత్తూరు సమీపం మదురవాయల్‌ బైపాస్‌ రోడ్డుపై వెళుతుండగా, అక్కడి పెట్రోలు బంక్‌లో నుండి వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఎదురుగా వచ్చి ఢీకొంది. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో పద్మానాభన్‌, దీపిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు.

ఇంద్రాణి, కారు డ్రైవర్‌ భువనేశ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందగానే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారుణమైన కారును మణికంఠన్‌ అనే యువకుడు మద్యం మత్తులో నడిపాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదం జరిగిన వెంటనే మణికంఠన్‌ పారిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 25 , 2025 | 12:03 PM