Hyderabad: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి.. పుస్తెల తాడుతో..
ABN, Publish Date - Mar 11 , 2025 | 08:00 AM
వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కుని సంఘటన నగరంలో చోటుచేసుకుంది. అయితే.. సమాచామందుకున్న పోలీసులు కేవలం రెండున్నర గంటల్లోనే కేసును చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: ఓ వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును లాక్కుని పరారైన వ్యక్తిని 12 గంటల వ్యవధిలో బాచుపల్లి(Bachupalli) పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి సోమవారం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ విషయమై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పర్యవేక్షణలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ ఉపేందర్, డీఐ యాదయ్యలతో సోమవారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్(Bachupalli Police Station)లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..
ప్రవీణ్‌సాగర్(30) నిజాంపేట రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని ప్రగతినగర్‌లో నివాసముంటూ స్విగ్గీ, జొమాటో, రియో(Swiggy, Zomato, Rio)లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 8న రాత్రి రాజీవ్ గృహకల్ప(Rajiv Gruhakalpa)లో నివాసముంటున్న కెళ్ల బాలమ్మ(55) ఇంటికి వెళ్లి మీకు రియో నుంచి పార్సిల్ వచ్చిందని చెప్పి అందజేశాడు. అనంతరం తాను కూడా రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నానంటూ మాటలు కలిపి ఆమె వద్దనున్న రెండున్నర తులాల పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు.
బాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఉపేందర్ పర్యవేక్షణలో క్రైం డీఐ యాదయ్య సిబ్బందితో నిఘా పెట్టారు. 12 గంటల వ్యవధిలో అతడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతడి నుంచి గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News
Updated Date - Mar 11 , 2025 | 08:00 AM