Share News

కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:14 AM

మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న కోపంతోనే దేవాదుల కాల్వ ద్వారా కాళేశ్వరం జలాలు అందించడంలేదని,దీంతో చేతికందిన పంటలు ఎండుతున్నాయని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం నీరందకనే  ఎండుతున్న పంటలు

డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

ఆలేరు రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న కోపంతోనే దేవాదుల కాల్వ ద్వారా కాళేశ్వరం జలాలు అందించడంలేదని,దీంతో చేతికందిన పంటలు ఎండుతున్నాయని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆలేరులోని శ్రీనివాసపురం, గుండ్లగూడెం, సేవాలాల్‌తండా గ్రామాల్లో ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఆలేరు ప్రాంతానికి సాగునీరందించడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో రైతులు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేశారని, ప్రస్తుతం పంటలు ఎం డిపోతుండటంతో రైతులకే కన్నీరే మిగిలిందన్నారు. ఎండిన పంటలకు రూ.25వేలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాసపురంలో తాగు నీరులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇటుగా ఎమ్మెల్యే తొంగి చూడడం లేదని విమర్శించారు. నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీనివాసపురంలో ఈ దుస్థితి ఉండటం బాధాకరమన్నా రు. కార్యక్రమంలో నాయకులు మొగులగాని మల్లేశం, వస్పరి శంకర య్య, గడ్డమీది రవీందర్‌, కందుల రామన్‌, కోరికొప్పుల కిష్టయ్య, గంగుల శ్రీనివాస్‌, రచ్చ రాంనర్సయ్య, కృష్ణ, నవ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:14 AM