RDO: రోడ్డు ప్రమాదంలో ఆర్డీవో దేవసేన దుర్మరణం
ABN, Publish Date - Jun 20 , 2025 | 01:00 PM
తిరుచ్చి జిల్లా ముక్కొంబు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముసిరి రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) ఆరముత్త దేవసేన మృతిచెందారు. ముసిరి ఆర్డీవో దేవసేన గురువారం ఉదయం ప్రభుత్వ వాహనంలో తిరుచ్చి వైపు బయల్దేరారు.
చెన్నై: తిరుచ్చి జిల్లా ముక్కొంబు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముసిరి రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) ఆరముత్త దేవసేన(Aramutha Devasena) మృతిచెందారు. ముసిరి ఆర్డీవో దేవసేన గురువారం ఉదయం ప్రభుత్వ వాహనంలో తిరుచ్చి వైపు బయల్దేరారు. తిరుచ్చి-కుళిత్తలై రోడ్డు ముక్కొంబు సమీపంలో హఠాత్తుగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలిపోయింది. ఆ సమయంలో ముందు వెళ్తున్న ప్రభుత్వ బస్సును తప్పించేందుకు డ్రైవర్ ఎడమ వైపు వాహనం తిప్పినట్లు సమాచారం.
ఆ సమయంలో బస్సు సమీపంలో ఉన్న ఎక్సకవేటర్‌ను ఆర్డీవో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముందు సీట్లో ఉన్న ఆర్డీవో దేవసేన తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అరినత్తుం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
సీఎం దిగ్బ్రాంతి
రోడ్డు ప్రమాదంలో ముసిరి ఆర్డీవో మృతిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో... ఆర్డీఓ ఆరముత్త దేవసేన మృతి రెవెన్యూ శాఖకు తీరని నష్టమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆమె కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు, ప్రభుత్వ అధికారుల బీమా మొత్తం రూ. కోటి అందజేస్తామని సీఎం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 20 , 2025 | 01:00 PM