ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పుల్లయ్య వచ్చాడట పదండి..

ABN, Publish Date - Apr 03 , 2025 | 09:53 AM

పుల్లయ్య వచ్చాడంట పదండి అంటూ.. బాధితులు పెద్దఎత్తున అక్కడకు చేరారు. ఆంధ్రపదేశ్‏కు చెందిన పుల్లయ్య అనే తాపీ మేస్త్రీ కూకట్‏పల్లి ఏరియాలో నివాసముంటూ చిట్టీనాటల పేరుతో దాదాపు రూ. 100 కోట్లమేర మోసగించాడు. ఆయన గత కొద్దిరోజులుగా కనిపిచకుండాపోయాడు. అయితే.. ఆయన వచ్చాడన్న సమాచారం తెలుసుకుని అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నారు.

- చిట్టీల వ్యాపారి ఇంటికి వందలాది మంది బాధితులు

- ఉద్రిక్తత నడుమ నాంపల్లి సీసీఎస్‌కు నిందితుడి తరలింపు

హైదరాబాద్: దాదాపు వంద కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి పుల్లయ్య(Pullaiah)ను విచారణ నిమిత్తం సీసీఎస్‌ పోలీసులు బుధవారం సాయంత్రం దాసారం గుడిసెల సమీపంలోని అతని ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధితులు పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రవీంద్రానగర్‌(Ravindranagar)కు చెందిన పుల్లయ్య తన వద్ద చిట్టీలు వేసిన వందలాది మంది సభ్యులను, పెట్టుబడిదారులను మోసం చేసి రూ.100 కోట్లతో పరారైన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం.. విషయం ఏంటంటే..


బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు గత నెల పుల్లయ్యను బెంగళూరులో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తిరిగి విచారణ నిమిత్తం నిందితుడిని కస్టడీకి తీసుకుని బుధవారం సాయంత్రం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల బందోబస్తు మధ్య రవీంద్రానగర్‌లోని అతని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చిట్టీల బాధితులు పెద్ద సంఖ్యలో పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. సీసీఎస్‌ ఏసీపీ మల్లికార్జున్‌ చౌదరి(CCS ACP Mallikarjun Chowdhury) ఆధ్వర్యంలో పుల్లయ్యను సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు విచారించారు.


అతను నిర్వహించన చిట్టీల వివరాలను, ఇతర వ్యాపారాల సమాచారం, ఆస్తుల గురించి తెలుసుకున్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాల్లో అడిగి తెలుసుకున్నారు. పుల్లయ్య ఇంట్లో ఉన్న ఫార్చూనర్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి పుల్లయ్యను పోలీసు వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులను నిలువరిస్తూ పోలీసులు నిందితుడిని నాంపల్లి సీసీఎస్‌ స్టేషన్‌(Nampally CCS Station)కు తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 09:57 AM