Hyderabad: పార్క్ చేసిన బైకులకు నిప్పు..
ABN, Publish Date - Oct 04 , 2025 | 09:57 AM
పార్కు చేసిన బైకులపై పెట్రోల్ పోసి దుంవగులు నిప్పంటించిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడ్డమీదబస్తీలో నివాసముంటున్న దీపక్ దాస్ తనకు చెందిన రెండు బైకులు ఈనెల 8న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు.
- దుండగుల దుశ్చర్య
హైదరాబాద్: పార్కు చేసిన బైకులపై పెట్రోల్ పోసి దుంవగులు నిప్పంటించిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్(Tukaramgate Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడ్డమీదబస్తీలో నివాసముంటున్న దీపక్ దాస్ తనకు చెందిన రెండు బైకులు ఈనెల 8న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు. గురువారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బస్తీలోకి ప్రవేశించి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
కొద్ది సేపటికే మంటలు చెలరేగి ఇవి పూర్తిగా కాలిపోయాయి. గమనించిన బస్తీవాసులు బాధితులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల చూస్తే ఎవరూ కనిపించలేదు. దీంతో తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డిలతో పాటు ఎస్సైలు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రమాదేవి, దేవయ్య, శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. పాత కక్షల కారణంగానే బైకులకు నిప్పంటించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News
Updated Date - Oct 04 , 2025 | 09:57 AM