Odisha Puri: బీచ్‌కి వెళ్లిన యువతిపై అఘాయిత్యం..ప్రియుడిని చెట్టుకు కట్టేసి..
ABN, Publish Date - Sep 16 , 2025 | 01:29 PM
ఒడిశా పూరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. అక్కడ వారు కూర్చున్నప్పుడు పలువురు వీడియో తీసి మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు.
ఒడిశా పూరీ (Odisha Puri) జిల్లాలో ఇటీవల ఓ యువతిపై చోటుచేసుకున్న ఘటన అనేక మందిని షాక్‌కు గురి చేస్తుంది. 19 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడితో కలిసి సాయంత్రం ఓ బీచ్‌కు వెళ్లింది. అక్కడ వారు కూర్చుని ఉండగా నలుగురు యువకులు వారి వద్దకు వచ్చి వీడియోలు తీశారు. ఆ తర్వాత మీ వీడియోలు తీశాం, డబ్బు ఇచ్చిన తర్వాత వాటిని తొలగిస్తామని బెదిరించారు.
డబ్బులు ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో, ఆ నలుగురిలో ఇద్దరు యువతిపై అత్యాచారం చేయగా, మిగతా వారు ఆమె ప్రియుడిని చెట్టుకు కట్టేసి కొట్టిపడేశారు (boyfriend tied up). బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు స్థానిక యువకులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడు.
ఒడిశాలో ఇలాంటి అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. గత బుధవారం భువనేశ్వర్‌లోని ఓ లాడ్జ్‌లో మరో ఘటన జరిగింది. ఓ సింగర్ యువతికి పెద్ద మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇస్తామని నమ్మించి, ముగ్గురు వ్యక్తులు లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు పానీయం ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
దీనికి ముందు సెప్టెంబర్ 5న కంధమాల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల 9వ తరగతి విద్యార్థిని తన సోదరి గ్రామానికి గణేష్ నిమజ్జనం చూసేందుకు వెళ్తుండగా, 28 ఏళ్ల వ్యక్తి ఆమెకు కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, కారులోనే అత్యాచారం చేశాడు. ఐదు రోజుల తర్వాత ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో ఒడిశాలో మహిళల భద్రత గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. యువతులు, బాలికలు ఎక్కడా సురక్షితంగా లేని పరిస్థితి కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే మరింత కఠిన చట్టాలను తీసుకురావాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 16 , 2025 | 01:30 PM