Heartbreaking Incident: ప్యాంట్‌పై సూసైడ్ నోట్.. అతడి ఆత్మహత్యకు కారణమేంటో తెలిస్తే..
ABN, Publish Date - Sep 04 , 2025 | 08:33 AM
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో విషాదభరిత ఘటన చోటు చేసుకుంది. భార్య, అత్తమామలు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్‌ను తన ప్యాంట్‌పై రాశాడు. మృతుడి పేరు దిలీప్.
ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని ఫరూఖాబాద్‌లో విషాదభరిత ఘటన చోటు చేసుకుంది. భార్య, అత్తమామలు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తను చనిపోయే ముందు సూసైడ్ నోట్‌ను తన ప్యాంట్‌పై రాశాడు. మృతుడి పేరు దిలీప్. దిలీప్ రోజూ మద్యం మత్తులో వచ్చి తనను హింసిస్తున్నాడని అతడి భార్య స్థానిక నాగ్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడికి వేధింపులు మొదలయ్యాయి. తీవ్ర మనస్థాపానికి గురైన దిలీప్ ఆత్మహత్య చేసుకున్నాడు (Crime News).
దిలీప్‌పై అతడి భార్య గృహహింస కేసు పెట్టడంతో పోలీసులు అతడిని సోమవారం స్టేషన్‌కు పిలిపించారు. అతడి భార్య, అత్తమామలు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు. కేసును పరిష్కరించుకునేందుకు తమకు రూ. 50,000 చెల్లించాలని ఇద్దరు కానిస్టేబుళ్లు దిలీప్‌పై ఒత్తిడి తెచ్చారు. దిలీప్ నిరాకరించడంతో, అతణ్ని కొట్టారు. చివరికి రూ. 40,000 కోసం రాజీ కుదరడంతో విడుదల చేశారు (Heartbreaking Incident). పోలీసులు చేసిన అవమానం, హింసను దిలీప్ తట్టుకోలేకపోయాడు.
ఇంటికి చేరుకున్న వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను వేసుకున్న తెల్లటి ప్యాంటుపై సూసైడ్ నోట్ రాశాడు. తనను వేధించిన భార్య తరఫు వ్యక్తుల పేర్లు, లంచం అడిగిన పోలీసుల పేర్లు, తను అనుభవించిన మానసిక వేధింపుల గురించి తన ప్యాంట్‌పై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం దిలీప్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్‌ను వేధించిన వారిందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
బీ ఏ హీరో.. అడాప్ట్ పప్పీ నినాదంతో జాతీయ కుక్కల దత్తత మేళా
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
Updated Date - Sep 04 , 2025 | 09:36 AM