ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Woman Arrested: పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

ABN, Publish Date - May 16 , 2025 | 09:43 PM

యజమాని ఇంట్లో దొంగిలించిన చీరతో పొటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. పోలీసులకు ఈ ఫొటో చేరడంతో చివరకు జైలుపాలైంది.

Kolkata stolen sari case

ఇంటర్నెట్ డెస్క్: తాను పనిచేసే ఇంట్లో చోరీ చేసిన ఓ పనిమనిషి తను దొంగిలించిన చీరతో ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టి అడ్డంగా బుక్కయిపోయింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో చివరకు ఆమె జైలుపాలైంది. కోల్‌కతాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది.

నగరానికి సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. గతేడాది అశిష్‌దాస్ గుప్తా అనే మాజీ ప్రభుత్వోద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. గాజులు, చెవి దుద్దులు, బంగారు గొలుసు, చీరలును దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పని చేస్తున్న పూజా సర్దార్ అనే మహిళపై కూడా వారికి అనుమానం కలిగింది. కానీ తగిన ఆధారాలు లేకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. అయితే, యజమానికి తనపై అనుమానం వచ్చిందని గుర్తించిన వెంటనే పూజా సర్దార్ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది.


అదే ప్రాంతంలో పలు చోరీలు జరగడంతో పోలీసులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఇంతలో ఆశిష్‌దాస్ కుమార్తెకు పూజా సర్దార్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఫొటో కంటపడింది. ఆమె కట్టుకున్న బనారస్ చీర తమదేని ఆశిష్‌దాస్ కుమార్తె గుర్తించింది. వెంటనే ఆ ఫొటోను స్క్రీన్ షాట్ తీసి పోలీసులతో పంచుకుంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వలపన్ని పూజను అదుపులోకి తీసుకున్నారు. తానే తప్పు చేయలేదని తొలుత బుకాయించిన మహిళ చివరకు చోరీ చేసిన విషయాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో పోలీసులు మరో ఐదుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఓ స్కూటర్, బైక్, ఇతర విలువైన వస్తువులు, రూ.1.26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తును ఆయా యజమానులకు అప్పగించారు.


ఇవి కూడా చదవండి:

ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు

నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

Read Latest and Crime News

Updated Date - May 16 , 2025 | 09:49 PM