Hyderabad: నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN, Publish Date - May 20 , 2025 | 09:04 AM
నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో.. అవసరం ఉందని, అప్పుగా తీసుకున్న రూ.18.5 లక్షలను తిరిగి ఇవ్వకుండా నకిలీ నోట్లను అంటగట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నమ్మి రూ.18.5 లక్షలిస్తే.. నకిలీ నోట్లు అంటగట్టారు
మహిళ ఫిర్యాదుతో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: వ్యాపార భాగస్వామికి నకిలీ నోట్లు అంటకట్టిన వ్యక్తితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన మనీషా సావంత్.. ఆమె తండ్రి స్నేహితుడైన రామ్‌పటేల్‌తో కలిసి వ్యాపార లావాదేవీలు సాగించేది. తనకు అర్జంట్‌గా బ్యాంక్ ఖాతాలో రూ.18.5 లక్షలను జమ చేయాల్సి ఉందని, వాటిని తనకు ఇస్తే వెంటనే ఇచ్చేస్తానని మనీషాసావంత్‌కు రామ్‌పటేల్ చెప్పాడు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..
దీంతో ఆమె ఈనెల 17న అతడి ఖాతాకు రూ.18.5 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేసింది. డబ్బులు తిరిగి ట్రాన్స్‌ఫర్ చేయాలని అతడిని అడిగితే ఆదాయ పన్ను శాఖ అధికారులతో ఇబ్బందులు ఉన్నాయని, నగదు ఇస్తానని చెప్పాడు. ఆమెకు నగదుతో కూడిన బ్యాగును అప్పగించాడు. ఆమె ఓపెన్ చేసి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ నోట్లు ఉన్నాయి.
ఇదేంటని ప్రశ్నించేలోపే అతడు కారుతో ఆమెను ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. రాంపటేల్‌తో పాటు అతడి స్నేహితులైన రాజ్ కిషోర్ సాహూ, దేవెందర్ కుమార్ పటేల్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు
Read Latest Telangana News and National News
Updated Date - May 20 , 2025 | 09:22 AM