ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా..

ABN, Publish Date - May 30 , 2025 | 09:44 AM

ఓ యువకుడు బ్లేడుతో చేయి కోసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‏గూడలో జరిగింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా.. నంటూ చేయి కోసుకున్నాడు. ఎన్‌.అరవింద్‌ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయానా.. ఆమె తిరస్కరించడంతో బ్లేడుతో చేయి కోసుకున్నాడు.

- బ్లేడ్‌తో చేయి కోసుకున్న యువకుడు

హైదరాబాద్: పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తూ బ్లేడ్‌తో యువకుడు చేయి కోసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‏గూడ లక్ష్మీనరసింహనగర్‌లో నివసించే యువతి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ఎంఆర్‌డీగా పనిచేస్తుంది. వెంకటగిరిలో నివసించే సమీప బంధువు ఎన్‌.అరవింద్‌ రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ వెంబడించాడు. ఆమె ఒప్పుకోలేదు. పట్టు వదలకుండా వెంబడిస్తుండడంతో ప్రేమను అంగీకరించింది.


ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా వారు వ్యతిరేకించారు. దీంతో తాను పెళ్లి చేసుకోలేనని చెప్పింది. ఈనెల 27న ఆమె ఆస్పత్రిలోని పార్కింగ్‌లో ఉండగా, అరవింద్‌ అక్కడికి వెళ్లాడు. పెళ్లి చేసుకుంటావా? లేదా? అంటూ ప్రశ్నించాడు. ఆమె కుదరదని చెప్పడంతో తనతో తెచ్చుకున్న బ్లేడ్‌ తీసి చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. యువతి ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 09:44 AM