Hyderabad: డబ్బులు ఇస్తావా.. నాతో సన్నిహితంగా దిగిన ఫొటోలు బయటపెట్టమంటావా..
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:56 PM
‘డబ్బులు ఇస్తావా..నాతో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలు మీ కుటుంబసభ్యులకు పంపమంటావా’ అంటూ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు ప్రియుడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
- ప్రియురాలికి బెదిరింపులు
- పోలీసులను ఆశ్రయించిన యువతి
హైదరాబాద్: ‘డబ్బులు ఇస్తావా..నాతో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలు మీ కుటుంబసభ్యులకు పంపమంటావా’ అంటూ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు ప్రియుడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ(Devarakonda)కు చెందిన యువతి(19) ఎస్.ఆర్.నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ టెలికాలర్ ఉద్యోగం చేస్తుంది. ఆరు నెలల క్రితం యువతికి తరుణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
కొంత కాలానికి స్నేహితులయ్యారు. యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. మూడు రోజుల నుంచి డబ్బు ఇవ్వాలని.. లేకుంటే సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఆందోళనకు గురైన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్.ఆర్.నగర్(SR Nagar) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 26 , 2025 | 12:56 PM