ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కోరిక తీర్చకపోతే చంపేస్తా..

ABN, Publish Date - Jul 10 , 2025 | 08:35 AM

‘నా కోరిక తీర్చకపోతే చంపేస్తా.. వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతా’ అంటూ బెదిరించడమే కాకుండా అందరూ చూస్తుండగా యువతిని రోడ్డు మీదకు ఈడ్చుకువచ్చి రాయితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది.

- యువతిపై రాయితో దాడి

హైదరాబాద్: ‘నా కోరిక తీర్చకపోతే చంపేస్తా.. వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతా’ అంటూ బెదిరించడమే కాకుండా అందరూ చూస్తుండగా యువతిని రోడ్డు మీదకు ఈడ్చుకువచ్చి రాయితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. షేక్‌పేట మారుతీనగర్‌(Sheikhpet Marutinagar)కు చెందిన యువతి ఓ డెంటల్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్టు. 2018లో ఓ వ్యక్తితో వివాహమైంది. అంతకుముందు కిరణ్‌ అనే యువకుడితో సహజీవనం చేసింది.

పెళ్లి అయిపోయాక ఇద్దరు తరచూ మాట్లాడుకునే వారు. దీనిని అదునుగా తీసుకొని కిరణ్‌ తనతో ఉండాలంటూ ఒత్తిడి తేవడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చకపోతే ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కుటుంబసభ్యులకు పంపించడమే కాకుండా సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె మాట్లాడడం మానేసింది.

ఈనెల 7న యువతి పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లిన కిరణ్‌ ఆమెను చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు తీసుకువచ్చి రాయితో కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించారు. అతడిని విడిపించుకున్న యువతి ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 08:35 AM