ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నగదును ఎక్స్ఛేంజ్‌ చేస్తామని రూ.11.71 లక్షలు దోచేశారు..

ABN, Publish Date - Jul 29 , 2025 | 08:24 AM

నగదును విదేశీ కరెన్సీలోకి ఎక్స్ఛేంజ్‌ చేస్తామని పిలిపించి రూ.11.71 లక్షలను దోచేసిన గ్యాంగ్‌ను టోలిచౌకి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.7.55 లక్షలు రికవరీ చేశారు. సౌత్‌ వెస్ట్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ కృష్ణాగౌడ్‌, టోలిచౌకి ఏసీపీ ఫయాజ్‌ వివరాలను వెల్లడించారు.

- గ్యాంగ్‌ అరెస్ట్‌.. రూ.7.55 లక్షలు రికవరీ

హైదరాబాద్: నగదును విదేశీ కరెన్సీలోకి ఎక్స్ఛేంజ్‌ చేస్తామని పిలిపించి రూ.11.71 లక్షలను దోచేసిన గ్యాంగ్‌ను టోలిచౌకి పోలీసులు(Tolichawki Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.7.55 లక్షలు రికవరీ చేశారు. సౌత్‌ వెస్ట్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ కృష్ణాగౌడ్‌, టోలిచౌకి ఏసీపీ ఫయాజ్‌(Tolichawki ACP Fayaz) వివరాలను వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం సాయిప్రసాద్‌రెడ్డి తన నగదును విదేశీ కరెన్సీలోకి మార్చుకొనేందుకు ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా కొంతమందిని ఆశ్రయించాడు.

ఆన్‌లైన్‌లో పరిచయమైన సయ్యద్‌ మాజ్‌ హుస్సేన్‌, ఇర్ఫాన్‌ టోలిచౌకి పారామౌంట్‌ కాలనీలోని ఫ్లైట్‌ టికెట్లు విక్రయించే షాపు వద్దకు అతడిని పిలిచారు. రూ.11.71 లక్షలతో సాయి ప్రసాద్‌రెడ్డి అక్కడికి వచ్చాడు. సయ్యద్‌, ఇర్ఫాన్‌(Syed, Irfan)తో పాటు మరికొందరు అక్కడకు చేరుకుని సాయిప్రసాద్‌ దృష్టి మళ్లించి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు టోలిచౌకి పోలీసులను ఆశ్రయించాడు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బహదూర్‌పురాకు చెందిన మహ్మద్‌ బిలాల్‌ (28), హకీంపేట్‌ కాలనీకి చెందిన ఎండీ అబ్దుల్‌ ఆజామ్‌ అలియాస్‌ పర్వీజ్‌ (30) క్యాబ్‌ డ్రైవర్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ (30), బ్యాటరీల వ్యాపారి మహ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ (25), ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వాహకుడు సయ్యద్‌ మాజ్‌ హుస్సేన్‌(23)లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. మరో నలుగురు అబ్దుల్‌ షమీద్‌, సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ అఖిల్‌ అహ్మద్‌, సయ్యద్‌ ఇర్ఫాన్‌ పరారీలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 08:24 AM