Hyderabad: కూతురి కళ్లెదుటే కన్నతల్లి దుర్మరణం..
ABN, Publish Date - Jul 29 , 2025 | 07:51 AM
ఫ్రిజ్ హ్యాండిల్‌కు కరెంట్ సరఫరా అయి కూతురి కళ్లెదుటే కన్నతల్లిదుర్మరణం చెందింది. రక్షించబోయిన కుమార్తెకు సైతం విద్యుత్‌షాక్ తగిలింది. ఈ విషాద ఘటన సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ ఎర్రబోడలో జరిగింది. వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ఎర్రబోడలో బి. లావణ్య(38) కుటుంబం నివాసం ఉంటోంది.
- ఫ్రిజ్ హ్యాండిల్‌కు కరెంట్ సరఫరా అయి షాక్‌తో మృతి
- రక్షించబోయిన కుమార్తెకు కూడా విద్యుతాఘాతం
- ఎర్రబోడలో విషాద ఘటన
హైదరాబాద్: ఫ్రిజ్ హ్యాండిల్‌కు కరెంట్ సరఫరా అయి కూతురి కళ్లెదుటే కన్నతల్లిదుర్మరణం చెందింది. రక్షించబోయిన కుమార్తెకు సైతం విద్యుత్‌షాక్ తగిలింది. ఈ విషాద ఘటన సోమవారం రాజేంద్రనగర్(Rajendranagar) సర్కిల్ ఎర్రబోడలో జరిగింది. వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ఎర్రబోడలో బి. లావణ్య(38) కుటుంబం నివాసం ఉంటోంది. భర్త 11 ఏళ్ల క్రితం మరణించగా కుమార్తెతో కలిసి ఆమె ఉంటోంది. వీరిది రేకుల ఇల్లు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గొడలకు నీటి చెమ్మ పట్టింది. ఆ ఇంటికి ఎర్త్ లేదు.
సోమవారం ఉదయం లావణ్య ఫ్రిజ్ తెరవడానికి హ్యాండిల్ పట్టుకోగా విద్యుదాఘాతంతో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్పటికే కూతురు పూజిత (17) తల్లిని కాపాడటానికి ప్రయత్నించగా ఆమెకు కూడా షాక్ తగిలింది. వెంటనే ఇంటి పక్కనుంటున్న బంధువుకు పద్మారావుకు కలిసి జరిగిన విషయం తెలిపింది. ఆయన వెంటనే ఇక్కడికి చేరుకొని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే లావణ్య మరణించిందని చెప్పారు. కేసును రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 29 , 2025 | 07:51 AM