ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య

ABN, Publish Date - Jun 10 , 2025 | 08:50 AM

తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రాకేష్‏కుమార్‌ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌ సుభాష్‏నగర్‌లో నివసిస్తున్నారు.

హైదరాబాద్: తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రాకేష్‏కుమార్‌ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌ సుభాష్‏నగర్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తలు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండవ కుమార్తె తేజస్విని(19) చింతల్‌లోని గౌతమి కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసింది. ప్రతీరోజూ రాత్రింబవళ్లు ఫోన్‌ మాట్లాడుతుండడంతో తండ్రి రాజేష్ కుమార్‌ ఈనెల 8వ తేదీ రాత్రి మందలించాడు.

మనస్తాపం చెందిన తేజస్విని సోమవారం తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఫైబర్‌ నెట్‌ కోసం వచ్చిన టెక్నీషియన్‌ రాజే్‌షకుమార్‌కు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. ఇంటి పక్కనే ఉన్న లక్ష్మికి ఫోన్‌ చేశాడు. ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా తేజస్విని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కల వారి సహాయంతో ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజేష్ కుమార్‌ ఫిర్యాదు మేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 08:52 AM