ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PhonePe: ఫోన్‌పే పేరుతో బురిడీ కొట్టించి..

ABN, Publish Date - May 30 , 2025 | 10:17 AM

ఫోన్‌పే పేరుతో ఓ వ్యక్తి విద్యార్థిని మోసం చేసిన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తన ఏటీఎం కార్డు, ఫోన్‌పే పనిచేయడం లేదంటూ నమ్మించి రూ. 10 వేలు తీసుకొని ఉడాయించాడు. తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్: ఫోన్‌పే పేరుతో ఓ వ్యక్తి విద్యార్థిని మోసం చేశాడు. రూ.10 వేలు నగదు తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(SR Nagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లికి చెందిన అల్లాడి శివశంకరవరప్రసాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. శ్రీ రాజరాజేశ్వరీ బాయ్స్‌ హాస్టల్లో ఉంటున్న ప్రసాద్‌ స్థానికంగా ఉన్న కెనరా బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌కు వెళ్లి రూ.10వేలు డ్రా చేసుకున్నాడు.


ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తన ఏటీఎం కార్డు పనిచేయడం లేదని, అత్యవసరంగా డబ్బు అవసరంపడిందని, రూ.10 వేలు ఇస్తే ఫోన్‌ పే చేస్తానని నమ్మించాడు. ఫోన్‌పే లావాదేవి జరిగినట్లు ఓ మెసేజ్‌ చూపించి ప్రసాద్‌ వద్ద నగదు తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఫోన్‌పేలో డబ్బుల కోసం చూడగా కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి హెల్మెట్‌, మాస్క్‌ ధరించి ఉన్నట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 10:19 AM