Hyderabad: రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది
ABN, Publish Date - Oct 15 , 2025 | 07:53 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లిలో ఘటన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టు(Korpolu Chandra Reddy Resort)లో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం గాజుల రామారానికి చెందిన తిరుపతిరెడ్డి (వేద అగ్రి సీడ్స్), రాక్ స్టార్ ఫెర్టిలైజర్స్ సైదారెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన డీలర్స్‌తో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ పార్టీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 56 మంది డీలర్లు, 20 మంది మహిళా డ్యాన్సర్లు పాల్గొన్నారు. పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరితో పాటు రిసార్టు యజమాని రాకేష్‌రెడ్డి(Rakesh Reddy)పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 3 బ్లాక్‌డాగ్ విస్కీ మద్యం బాటిళ్లు, రెండు కాటన్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News
Updated Date - Oct 15 , 2025 | 08:18 AM