Hyderabad: ఆ నలుగురు ఎక్కడికెళ్లినట్లు.. ఎక్కడున్నట్లు..
ABN, Publish Date - May 24 , 2025 | 11:22 AM
ఆ నలుగురు.. ఎక్కడికెళ్లారో తెలియదు.. ఎక్కడున్నారో తెలియదు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. భర్తకు మరో మహిళతో ఏర్పడ్డ అక్రమ సంబంధమే మొత్దం గొడవకు కారణమని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే..
- కుటుంబంలో వివాదం.. నలుగురి అదృశ్యం
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. బోయినపల్లి ఇన్‌స్పెక్టర్ తిరుపతిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన పల్లపు అనిత(35)కు ఓల్డ్ బోయినపల్లికి చెందిన చెంచయ్యతో 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు ధనుష్‌కుమార్, ఇద్దరు కుమారైలు లక్ష్మీ మానస, అమీనా సంతానం ఉన్నారు. చెంచయ్యకు మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
భార్య, పిల్లలను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన అనిత పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి ఆచూకీ లభించకపోవడంతో అనిత సోదరి లక్ష్మీప్రసన్న బోయినపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!
Read Latest Telangana News and National News
Updated Date - May 24 , 2025 | 11:22 AM