Hyderabad: పాడుబడ్డ ఇంట్లో అస్తి పంజరం..
ABN, Publish Date - Jul 15 , 2025 | 07:42 AM
ఓ పాడుబడిన ఇంట్లో అస్తిపంజరం వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపింది. హబీబ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లిలోని కేఫ్ పర్షియా హోటల్ వెనుక వీధిలో సోమవారం ఇద్దరు బాలురు క్రికెట్ ఆడుతుండగా బంతి సమీపంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లింది.
- సోషల్ మీడియాలో వైరల్‌తో వెలుగులోకి..
హైదరాబాద్: ఓ పాడుబడిన ఇంట్లో అస్తిపంజరం వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపింది. హబీబ్‌నగర్ పోలీసులు(Habibnagar Police) తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి(Nampally)లోని కేఫ్ పర్షియా హోటల్ వెనుక వీధిలో సోమవారం ఇద్దరు బాలురు క్రికెట్ ఆడుతుండగా బంతి సమీపంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లింది.
బంతి కోసం ఆ ఇంట్లోకి వెళ్లిన బాలుడికి ఎముకలగూడు కలిగిన అస్తిపంజరం కనిపించింది. దీంతో ఆ బాలుడు తన సెల్‌ఫోన్‌లో ఆ అస్తిపంజరాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
ఆ అస్తిపంజరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే వీలులేకపోవడంతో వైద్య బృందాన్ని అక్కడికి రప్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. అది ఎవరిదనేది గుర్తించేందుకు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ కిషన్, ఎస్‌హెచ్‌ఓ పురుషోత్తం పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు.. ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Jul 15 , 2025 | 07:42 AM