ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి

ABN, Publish Date - Mar 19 , 2025 | 07:02 AM

హైదరాబాద్ నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓచోట వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్తు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఏరియాలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- పోలీసుల డెకాయ్‌ ఆపరేషన్‌

- వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ గుట్టురట్టు

హైదరాబాద్: హలో నాగమణి.. అంటూ విటుల్లా వాట్సప్‌ మెసేజ్‌ చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును రట్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతుల్ని వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఆమెను అరెస్ట్‌ చేశారు. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి(Saroornagar Inspector Saidi Reddy) వెల్లడించిన వివరాల ప్రకారం అమీర్‌పేటకు చెందిన నాగమణి (Nagamani)) ఫిల్మ్‌ కాస్టింగ్‌ మేనేజర్‌నని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంది. యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దింపేది.

ఈ వార్తను కూడా చదవండి: Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్


ఓ వాట్సప్‌ ద్వారా కార్యకలాపాలు

నాగమణి వాట్సప్‌ ద్వారా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. యువతుల ఫొటోలను వాట్సప్‌ ద్వారా విటులకు పంపుతూ వారిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌లోనే బేరసారాలు సాగిస్తూ విటుల వద్దకే యువతులను పంపి వేలాది రూపాయలను వసూలు చేస్తుంది.


డెకాయి ఆపరేషన్‌తో ఆటకట్టు

నాగమణి వ్యభిచార కార్యకలాపాలపై సమాచారం అందుకున్న రాచకొండ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి బృందం, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ బృందం డెకాయిట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. అమ్మాయి కావాలని వాట్సప్‌ ద్వారా నాగమణిని సంప్రదించారు. ఆమె ఓ యువతితో దిల్‌సుఖ్‌నగర్‌ కమలానగర్‌కు వచ్చి వారితో బేరసారాలు సాగించింది. దీంతో నాగమణితో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దని, నాగమణి లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి యువతులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 07:20 AM