Woman Set Ablaze Over Dowry: భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం బయటపెట్టాడు..
ABN, Publish Date - Aug 23 , 2025 | 09:51 PM
Woman Set Ablaze Over Dowry: అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. కలిసి అత్తింట్లో చిత్రహింసలు అనుభవించారు. అదనపు కట్నం కోసం అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు వేధించే వారు.
21వ శతాబ్ధంలోనూ అదనపు కట్నం కోసం భార్యలను హింసిస్తున్న వారు లేకపోలేదు. మంచి భాగస్వామి .. అసలు భాగస్వామే దొరకటం కష్టమైన ఈ రోజుల్లో డబ్బుల కోసం మహిళలపై దారుణాలు పెరిగిపోయాయి. తాజాగా, ఓ భర్త అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు. భర్త మాత్రమే కాదు అత్తింటి వారు అందరూ కలిసి మహిళను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి సోదరి తెలిపిన వివరాల్లోకి వెళితే..
గ్రేటర్ నోయిడా శిర్సా గ్రామానికి చెందిన విపిన్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన నిక్కి అనే యువతితో 2016లో పెళ్లయింది. పెళ్లయిన ఆరు నెలలు వీరి కాపురం బాగానే సాగింది. తర్వాతి నుంచి విపిన్ కుటుంబం రంగు బయటపడింది. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తింటి వారు అందరూ నిక్కిని వేధించటం మొదలెట్టారు. ఓ మగ పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. 36 లక్షల తీసుకురావాలని తిట్టేవారు, కొట్టేవారు. గురువారం రాత్రి భర్త, మిగిలిన అత్తింటి వారు ఆమెపై దాడి చేశారు.
భర్త నిక్కిని దారుణంగా కొట్టాడు. తర్వాత అత్తింటి వారందరూ కలిసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న నిక్కి గట్టిగా అరుస్తూ మెట్ల మీదనుంచి కిందకు పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిక్కి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిక్కి భర్తను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిక్కి అత్తామామ, బావ( అక్క భర్త) కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఒకే ఇంట్లోకి అక్కాచెల్లెళ్లు
నిక్కి అక్కను కూడా అదే ఇంటికి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. కలిసి అత్తింట్లో చిత్రహింసలు అనుభవించారు. అదనపు కట్నం కోసం అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు వేధించే వారు. 36 లక్షల కట్నం తీసుకురాకపోతే చంపుతామని వారు బెదిరించారు. అన్నంత పని చేశారు. అక్క, కన్న కొడుకు ముందే నిక్కిని కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనపై నిక్కి కొడుకు మాట్లాడుతూ.. ‘నాన్న మా అమ్మను బాగా కొట్టాడు. అమ్మపై ఏదో పోశాడు. లైటర్‌తో నిప్పంటించాడు’ అని చెప్పాడు.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత దారుణమా.. మహిళ చెంప పగుల గొట్టిన దుర్మార్గుడు
కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Updated Date - Aug 23 , 2025 | 09:55 PM