Share News

Karate Kalyani Faces Complaint: కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ABN , Publish Date - Aug 23 , 2025 | 07:10 PM

Karate Kalyani Faces Complaint: సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కారణంగా కరాటే కళ్యాణి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొంతమంది ఆ గ్రూప్ మహిళలు పోలీసులను ఆశ్రయించారు.

Karate Kalyani Faces Complaint: కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Karate Kalyani Faces Complaint

ప్రముఖ నటి కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కారణంగా కరాటే కళ్యాణి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొంతమంది ఆ గ్రూప్ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు కాపీని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్‌బీటీ నగర్ మార్కెట్‌లో గ్రూప్ మహిళలు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు.


తమ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని ఓ మహిళ కనీసం అక్కడి పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేకుండా తమపై దుష్ప్రచారం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాపేక్ష లేకుండా తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. లేడీ బౌన్సర్లు అంటూ ఆమె మాట్లాడిన తీరు తమను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణి‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి

ఈ సారి వినాయక చవితి చాలా ప్రత్యేకం.. 500 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం..

నిత్య పెళ్లి కొడుక్కా మారిన కానిస్టేబుల్.. ఐదో పెళ్లికి సిద్ధమవ్వగా..

Updated Date - Aug 23 , 2025 | 07:20 PM