Suryapet Constable Marries 4 Women: నిత్య పెళ్లి కొడుక్కా మారిన కానిస్టేబుల్.. ఐదో పెళ్లికి సిద్ధమవ్వగా..
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:54 PM
Suryapet Constable Marries 4 Women: కృష్ణంరాజు నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడు. నలుగురిలో ముగ్గురు యువతులు కాగా.. ఓ బాలిక కూడా ఉంది. కొద్దినెలల క్రితమే బాలికతో పెళ్లయింది.
ఓ పోలీస్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఐదో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో అడ్డంగా బుక్కయ్యాడు. ఉద్యోగం ఊడింది. బాలికను పెళ్లి చేసుకున్న కారణంగా ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు అయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణంరాజు అనే వ్యక్తి నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కృష్ణంరాజు నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడు. నలుగురిలో ముగ్గురు యువతులు కాగా.. ఓ బాలిక కూడా ఉంది. కొద్దినెలల క్రితమే బాలికతో పెళ్లయింది. నాలుగు పెళ్లిళ్లు అయినా కూడా అతడు ఆగలేదు. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై ఎస్పీ నరసింహ విచారణ చేశారు. నిజమని తేలటంతో సీరియస్ అయ్యారు. కృష్ణం రాజును విధులనుంచి సస్పెండ్ చేశారు. బాలికను పెళ్లి చేసుకున్నందుకు గానూ అతడిపై ఫోక్సో చట్టం కింది కేసు కూడా ఫైల్ అయింది.
ఇవి కూడా చదవండి
20 రూపాయల కోసం మైనర్ల దారుణం.. యువకుడ్ని కత్తితో..
9 టు 5 జాబా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీచేతుల్లో..