How To Hit 10000 Steps: 9 టు 5 జాబా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీచేతుల్లో..
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:38 PM
How To Hit 10000 Steps: గంటలు గంటలు ఒకే చోట కూర్చుని పని చేస్తే.. మీకొచ్చే జీతాన్ని ఆస్పత్రి ఖర్చులకు పెట్టేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా డిస్క్ సమస్యలు వస్తే జీవితాంతం ఇబ్బంది పడాలి.
ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే సకల రోగాలు సరిగా నడవకపోవటం వల్లే వస్తాయి. ఎందుకంటే.. మన శరీరం మొత్తం ఇంటర్ లింక్ అయి ఉంటుంది. మానసిక ఆరోగ్యం.. శారీరక ఆరోగ్యంపైన.. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపైన డిపెండ్ అయి ఉంటాయి. రెండిటిలో ఏది చక్కగా లేకపోయినా.. రెండో దానిపై ఎఫెక్ట్ పడుతుంది. ప్రతీ రోజూ వ్యాయామం చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని దూరం పెట్టొచ్చు. అయితే, కొంతమందికి వ్యాయామం చేయాలన్న ఆసక్తి ఉండదు.
అలాంటి వారు నడకను ఆశ్రయించటం ఉత్తమం. ప్రతీ రోజూ 10 వేల అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉంటాము. కానీ, 9 టు 5 జాబ్ చేసే వారికి ఇది కష్టతరమైన పని. రోజులో 8 గంటలు ఆఫీస్‌లోనే గడిచిపోతాయి. అన్ని అడుగులు వేయటం ఓ కలలాగా మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఆ కలను సాకారం చేసుకోవచ్చు. 10 వేల అడుగుల్ని సులభంగా వేసేయవచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పనిని మధ్యలో ఆపాల్సిన అవసరం అంతకంటే లేదు.
10 వేల అడుగులు వేసే ట్రిక్స్..
చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి
గంటలు గంటలు ఒకే చోట కూర్చుని పని చేస్తే.. మీకొచ్చే జీతాన్ని ఆస్పత్రి ఖర్చులకు పెట్టేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా డిస్క్ సమస్యలు వస్తే జీవితాంతం ఇబ్బంది పడాలి. అందుకే పనికి ఆటంకం కలగకుండా మధ్యమధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. నీళ్లు తెచ్చుకోవడానికి, వాష్ రూముకు వెళ్లడానికి, ప్రతీ గంటలో కనీసం 3 నుంచి ఐదు నిమిషాలు అటు, ఇటు తిరగండి.
కాల్స్, మీటింగ్స్ సమయంలో..
మీరు ఫోన్ మాట్లాడుతున్నపుడు.. ఆన్‌లైన్ మీటింగ్స్‌లో ఉన్నపుడు నడవడానికి ప్రయత్నించండి. అప్పుడు పనికి ఆటంకం కలగకుండా మీ నడక గోల్ రీచ్ అవ్వొచ్చు.
మెట్లు వాడండి
రెండో అంతస్తులోనో, నాలుగో అంతస్తులోనో ఉన్న ఆఫీస్‌కు వెళ్లడానికి మీరు లిఫ్ట్ వాడుతున్నట్లయితే వెంటనే ఆపేయండి. లిఫ్ట్‌కు బదులు మెట్ల మీదనుంచి నడుచుకుంటూ వెళ్లండి.
లంచ్ బ్రేక్, ఈవినింగ్ వాక్
లంచ్ బ్రేక్ సమయంలో.. తిన్న తర్వాత నడవటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల ఫోకస్ కూడా పెరుగుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి, ఏదైనా స్నాక్ తీసుకుని మళ్లీ నడక మొదలెట్టండి. అప్పుడు ఈజీగా 10వేల అడుగుల గోల్ రీచ్ అవుతారు.
ఇవి కూడా చదవండి
వివాదంలో యశ్ తల్లి.. హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు
వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఓపెన్ చేశారా ఖేల్ ఖతమ్..