Yash Mother Pushpa Controversy: వివాదంలో యశ్ తల్లి.. హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:06 PM
Yash Mother Pushpa Controversy: మశ్ తల్లి పుష్ప కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘తీసింది ఒకే ఒక సినిమా. అది కూడా అట్టర్ ప్లాప్ అయింది. ఇంత దురహంకారం ఉండకూడదు. అది మంచిది కాదు. యశ్ ఎక్కడున్నాడు’ అంటూ మండిపడుతున్నారు.
ప్యాన్ ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్ప ఈ మధ్యే నిర్మాతగా మారారు. కన్నడలో ‘కొత్తలవాడి’ సినిమా చేశారు. ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన కన్నడనాట విడుదల అయింది. అయితే, ఆశించిన స్థాయిలో సినిమాకు స్పందన రాలేదు. కానీ, యశ్ తల్లిని వివాదాల్లోకి మాత్రం నెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందు యశ్ తల్లి మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నారు. వన్ ఉమ్యాన్ ఆర్మీగా ప్రమోషన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కన్నడ హీరోయిన్ దీపికా దాస్‌పై విమర్శలు చేశారు. పుష్ప చేసిన విమర్శలు యశ్‌ను కూడా చిక్కుల్లో పడేశాయి.
ఓ ఇంటర్వ్యూలో పుష్ప మాట్లాడుతూ.. ‘దీపిక దాస్ పెద్ద హీరోయిన్ కాదు.. చిత్ర పరిశ్రమలో ఆమె ఏం సాధించింది?’ అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కాంట్రవర్సీకి సైతం దారి తీసింది. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పుష్ప కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘తీసింది ఒకే ఒక సినిమా. అది కూడా అట్టర్ ప్లాప్ అయింది. ఇంత దురహంకారం ఉండకూడదు. అది మంచిది కాదు. యశ్ ఎక్కడున్నాడు’ అంటూ మండిపడుతున్నారు.
యశ్ ఇప్పుడు ఏం చేస్తాడు?
సోషల్ మీడియాలో రచ్చ అటు తిరిగి, ఇటు తిరిగి యశ్ మెడకు చుట్టుకుంది. కొంతమంది నెటిజన్లు యశ్‌ను నిందిస్తున్నారు. మరికొంతమంది ‘యశ్ తన తల్లితో ఈ విషయం గురించి మాట్లాడాలి. లేకపోతే ఆమె రానున్న రోజుల్లో మరిన్ని కామెంట్లు చేసే అవకాశం ఉంది. అప్పుడు గొడవ మరింత పెద్దది అవుతుంది’ అని అంటున్నారు. ఇక, యశ్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయంపై కలత చెందుతున్నారు. తల్లి కారణంగా యశ్ విమర్శల పాలు అవుతున్నాడని బాధపడుతున్నారు. అయితే, ఈ గొడవ ఆపడానికి యశ్ ఏం చేస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఆకాకరకాయతో రుచికరమైన బిర్యానీ..
వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఓపెన్ చేశారా ఖేల్ ఖతమ్..