Share News

Momo Seller Stabbed Over 20: 20 రూపాయల కోసం మైనర్ల దారుణం.. యువకుడ్ని కత్తితో..

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:27 PM

Momo Seller Stabbed Over 20: తుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి తర్వాత ముగ్గురు మైనర్లు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే తుల్‌ను లాల్ బహుదూర్ శాస్త్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

Momo Seller Stabbed Over 20: 20 రూపాయల కోసం మైనర్ల దారుణం.. యువకుడ్ని కత్తితో..
Momo Seller Stabbed Over 20

మనుషుల్లో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ముగ్గురు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. ఓ షాపు అతడ్ని కత్తితో పొడిచేశారు. అది కూడా తిన్నదానికి డబ్బులు అడిగినందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఈస్ట్ ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన 28 ఏళ్ల తుల్ బహదూర్ ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. ఖోదా కాలనీలో నివాసం ఉంటున్నాడు.


రాజ్‌బిర్ కాలనీలో మోమోల షాపు పెట్టుకున్నాడు. తాజాగా, ఓ ముగ్గురు మైనర్లు మోమోలు తినడానికి తుల్ షాపు దగ్గరకు వచ్చారు. 20 రూపాయల మోమోలు ఆర్డర్ చేసుకుని తిన్నారు. డబ్బులు కట్టకుండానే అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. తుల్ వారిని అడ్డగించాడు. 20 రూపాయలు కట్టి వెళ్లమన్నాడు. వాళ్లు డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో గొడవమొదలైంది. గొడవ సందర్భంగా ఆ ముగ్గురు కత్తులతో తుల్ ఛాతిపై పొడిచారు.


తుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి తర్వాత ముగ్గురు మైనర్లు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే తుల్‌ను లాల్ బహుదూర్ శాస్త్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. గాయాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తుల్‌ను ట్రోమా సెంటర్‌కు రిఫర్ చేశారు. స్థానికులు వెంటనే అక్కడికి తరలించారు. ప్రస్తుతం తుల్ పరిస్థితి నిలకడగా ఉంది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

9 టు 5 జాబా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీచేతుల్లో..

వివాదంలో యశ్ తల్లి.. హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 23 , 2025 | 05:30 PM