Share News

Ganesh Chaturthi 2025 Auspicious: ఈ సారి వినాయక చవితి చాలా ప్రత్యేకం.. 500 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం..

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:44 PM

Ganesh Chaturthi 2025 Auspicious: వినాయక చవితి రోజు అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకోనుంది. పండుగరోజే సర్వర్థ్ సిద్ధి యోగ, రవి యోగ, ప్రీతి యోగ, ఇంద్ర యోగ, బ్రహ్మయోగాలు ఏర్పడున్నాయి.

Ganesh Chaturthi 2025 Auspicious: ఈ సారి వినాయక చవితి చాలా ప్రత్యేకం.. 500 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం..
Ganesh Chaturthi 2025 Auspicious

వేద జ్యోతిష్యం ప్రకారం ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ జరగనుంది. ఇదే రోజు అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకోనుంది. పండుగరోజే సర్వర్థ్ సిద్ధి యోగ, రవి యోగ, ప్రీతి యోగ, ఇంద్ర యోగ, బ్రహ్మయోగాలు ఏర్పడున్నాయి. ఈ యోగాల ప్రభావంతో కొన్ని రోజుల వారికి మహర్దశ మొదలవ్వనుంది. ఆ రాశుల వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందనున్నారు. పట్టిందల్లా బంగారం కానుంది. ఐదు యోగాలు ఒకేసారి ఏర్పడటం వల్ల లాభపడే రాశులు ఇవే..


కుంభరాశి

వినాయక చవితి రోజున ఐదు యోగాలు ఒకే సారి ఏర్పడటం వల్ల కుంభరాశికి మంచిరోజులు మొదలవ్వనున్నాయి. జీవితంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి మొదలవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు.. కొత్త ఆదాయమార్గాలు ఏర్పడతాయి. వ్యాపార వేత్తలకు మంచిగా కలిసి వస్తుంది. వినాయక చవితి నుంచి జనాల్లో గౌరవం పెరుగుతుంది. డబ్బులు ఆదా చేయటం మొదలవుతుంది.


తులా రాశి

వినాయక చవితి రోజు నుంచి తులా రాశి వారి ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. పెళ్లి జీవితంలో కూడా మంచి రోజులు మొదలవుతాయి. పెళ్లి కాని వారికి మంచి, మంచి సంబంధాలు వస్తాయి. పెళ్లి జీవితంలో కొత్త కొత్త అనుభవాలను పొందుతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ప్రవర్తనకు అందరూ ఆకర్షితులవుతారు.


మకర రాశి

వినాయక చవితి రోజు నుంచి మకర రాశి వారి జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి. శుభవార్తలు వింటారు. చాలా రోజులనుంచి రాకుండా నిలిచిపోయిన డబ్బు మీకందుతుంది. మీ కష్టాల్లో చాలా వాటికి పరిష్కారం దొరుకుతుంది. అనుకోని లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. పని చేసే చోట్ల జూనియర్ల నుంచి సీనియర్ల నుంచి ప్రోత్సాహం అందుతుంది. మంచి గుర్తింపు కూడా వస్తుంది.


ఇవి కూడా చదవండి

గణేష్ చతుర్థి స్పెషల్..380కిపైగా ప్రత్యేక రైళ్ల ట్రిప్‌లు

నిత్య పెళ్లి కొడుక్కా మారిన కానిస్టేబుల్.. ఐదో పెళ్లికి సిద్ధమవ్వగా..

Updated Date - Aug 23 , 2025 | 06:50 PM