Ganesh Chaturthi Special Trains: గణేష్ చతుర్థి స్పెషల్..380కిపైగా ప్రత్యేక రైళ్ల ట్రిప్‌లు
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:31 PM
ఈసారి గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈసారి (2025) గణపతి పండుగ కోసం మొత్తం 380 స్పెషల్ రైళ్ల ట్రిప్‌లను నడపబోతోంది. ఇదో రికార్డు స్థాయి సంఖ్య అని చెప్పవచ్చు.
గణేష్ చతుర్థి సీజన్ వస్తోంది. దీంతో భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం గణపతి భక్తుల కోసం ఏకంగా 380 స్పెషల్ రైలు ట్రిప్‌లను నడపబోతోంది రైల్వే శాఖ (Ganesh Chaturthi Special Trains). ఇది ఇప్పటివరకూ నడిచిన గణపతి స్పెషల్ రైళ్లలో రికార్డు సంఖ్య కావడం విశేషం. ఈ ఫెస్టివల్ సీజన్‌లో హోమ్‌టౌన్‌లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఈ రైళ్లు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ప్రతి ఏటా పెరుగుతున్న రైళ్లు..
గణేష్ చతుర్థి సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రతి సంవత్సరం స్పెషల్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. 2023లో 305 స్పెషల్ రైళ్ల ట్రిప్‌లు నడిచాయి, 2024లో అది 358కి పెరిగింది. ఇప్పుడు 2025లో ఏకంగా 380 ట్రిప్‌లతో రైల్వే మరోసారి రికార్డు సృష్టిస్తోంది. ఈ పెరుగుదల చూస్తే, గణపతి భక్తులకు ఎంత సౌలభ్యం కల్పించాలని రైల్వే భావిస్తోందో అర్థమవుతుంది.
సెంట్రల్ రైల్వే లీడ్‌లో..
ఈ స్పెషల్ రైళ్లలో అత్యధిక భాగం సెంట్రల్ రైల్వే నడుపుతోంది. ఏకంగా 296 ట్రిప్‌లు మహారాష్ట్ర, కొంకణ్ బెల్ట్‌లోని ప్రయాణికుల రద్దీని హ్యాండిల్ చేయడానికి ప్లాన్ చేశారు. వెస్ట్రన్ రైల్వే 56 ట్రిప్‌లు, కొంకణ్ రైల్వే (KRCL) 6 ట్రిప్‌లు, సౌత్ వెస్ట్రన్ రైల్వే 22 ట్రిప్‌లతో ఈ పండగ సీజన్‌లో భక్తులకు సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతానికి వెళ్లే భక్తుల కోసం ఈ రైళ్ల హాల్ట్‌లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు.
కొంకణ్ రైల్వే రూట్‌లో కీలక స్టేషన్లు
కొంకణ్ రైల్వే రూట్‌లో గణపతి స్పెషల్ రైళ్లు ఎన్నో కీలక స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్టేషన్లు భక్తులకు, ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేలా ఎంపిక చేశారు. వాటిలో చిప్లూన్, రత్నగిరి, కంకవలి, సింధుదుర్గ్, కుడల్, సావంత్‌వాడి, మడగావ్, కర్వార్, ఉడుపి, ముర్దేశ్వర్, కుందాపుర, సురత్కల్ ఉన్నాయి. ఇవి కాకుండా కొంకణ్ రైల్వే రూట్‌లోని మరికొన్ని స్టేషన్లలోనూ ఈ రైళ్లు ఆగుతాయి. ఈ సుందరమైన కొంకణ్ రూట్‌లో ప్రయాణం చేస్తూ గణపతి దర్శనం చేసుకోవడం ద్వారా అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు.
ఫెస్టివల్ డేట్స్ & రైళ్ల షెడ్యూల్
ఈ సంవత్సరం గణపతి పూజ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 6 వరకు జరుపుకుంటారు. పండగ రద్దీని ముందుగానే హ్యాండిల్ చేయడానికి రైల్వే ఆగస్టు 11 నుంచే స్పెషల్ రైళ్లను నడపడం స్టార్ట్ చేసింది. పండగ దగ్గరపడే కొద్దీ ఈ రైళ్ల ఫ్రీక్వెన్సీని మరింత పెంచబోతున్నారు. అంటే, మీరు ఎప్పుడు ప్రయాణం చేయాలనుకున్నా, సౌకర్యవంతమైన రైలు దొరుకుతుందని చెప్పవచ్చు. ఈ స్పెషల్ రైళ్ల షెడ్యూల్, టైమింగ్స్, హాల్ట్‌ల వివరాలు అన్నీ IRCTC వెబ్‌సైట్, RailOne యాప్, లేదా కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి