Woman Slapped 8 Times: మరీ ఇంత దారుణమా.. మహిళ చెంప పగుల గొట్టిన దుర్మార్గుడు
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:10 PM
Woman Slapped 8 Times: కమల్ ఖన్నా అనే వ్యక్తి అక్కడి వచ్చాడు. వచ్చీ రాగానే యశికను బూతులు తిడుతూ ఆమెపై దాడి చేయటం మొదలెట్టాడు. ఆమె చెంపపై పదేపదే కొట్టసాగాడు.
దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు మనుషుల మధ్య చిచ్చురేపుతున్నాయి. కుక్కల కోసం జనాలు కొట్టుకుంటున్నారు. వీధి కుక్కలను పట్టి, షెల్టర్ హోమ్‌లలో పడేయాలని ఆగస్టు 11వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా రచ్చ మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పును చాలా మంది జంతు ప్రేమికులు తప్పుబట్టారు. అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తన తీర్పును మార్చింది. కుక్కలను స్టెరిలైజ్ చేసి మళ్లీ ఎక్కడ ఉన్న వాటిని అక్కడే వదలాలని తీర్పునిచ్చింది. దీంతో జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఘజియాబాద్‌కు చెందిన యశిక శుక్లా శుక్రవారం రాత్రి విజయ్‌నగర్‌లోని బ్రహ్మపుత్రా ఎన్‌క్లేవ్ సొసైటీ దగ్గరకు వెళ్లింది. అక్కడి రోడ్డు పై ఉన్న కుక్కలకు భోజనం పెట్టసాగింది. అదే సమయానికి కమల్ ఖన్నా అనే వ్యక్తి అక్కడి వచ్చాడు. వచ్చీ రాగానే యశికను బూతులు తిడుతూ ఆమెపై దాడి చేయటం మొదలెట్టాడు. ఆమె చెంపపై పదేపదే కొట్టసాగాడు. 38 సెకన్లలో ఏకంగా ఎనిమిది సార్లు ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు.
తనతో పాటు వచ్చిన మహిళ పిలిచి ‘అక్కా.. నువ్వు వీడియో రికార్డు చేయ్.. ఇతను నన్ను కొడుతున్నాడు’ అని అంది యశిక. ఆమె వీడియో తీయటం మొదలెట్టింది. కమల్ మాత్రం భయపడలేదు. ‘రికార్డు చేసుకోండి’ అంటూ యశికపై దాడి చేశాడు. యశిక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమల్‌ను అరెస్ట్ చేశారు. అతడు మాత్రం.. యశిక తనపై మొదటగా దాడి చేసిందని ఆరోపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు