ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wedding Invite Scam: వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఓపెన్ చేశారా ఖేల్ ఖతమ్..

ABN, Publish Date - Aug 23 , 2025 | 03:29 PM

Wedding Invite Scam: వెడ్డింగ్ ఇన్విటేషన్ల పేరిట ప్రతీ ఏటా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి. చదువురాని వారే కాకుండా చదువుకున్న వాళ్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

Wedding Invite Scam:

నేటి ప్రపంచంలో వాట్సాప్ ఓ నిత్యావసరం అయిపోయింది. వ్యక్తిగత పనులకు మాత్రమే కాకుండా ఆఫీస్ పనులకు కూడా వాట్సాప్ వాడకం పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో పెళ్లి పత్రికల్ని నేరుగా వెళ్లి ఇవ్వలేక.. వాట్సాప్ ద్వారా పంపేస్తున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చిన పెళ్లి పత్రిక ఓపెన్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి పత్రిక క్లిక్ చేయగానే బ్యాంకు అకౌంట్ల‌లోంచి లక్షల రూపాయల నగదు మాయం అయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం హింగోలి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ‘స్వాగతం.. ఆగస్టు 30వ తేదీ జరగబోయే పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. సంతోషాలకు తలుపులు తీసే ఒకే ఒక్క మార్గం ప్రేమ మాత్రమే’ అని ఉంది. దాని కింద వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు అని రాసి ఉన్న ఓ ఫైల్ ఉంది. మెసేజ్ చేసిన వ్యక్తి ఎవరో ఆ ప్రభుత్వ ఉద్యోగికి తెలీదు. ఎవరు పంపారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఏపీకే ఫైల్ క్లిక్ చేశాడు.

అంతే.. అతడి కొంప కొల్లేరు అయింది. కొన్ని నిమిషాల్లోనే అతడి బ్యాంకు అకౌంట్లలోంచి డబ్బులు మాయం అయ్యాయి. పది వేలో, ఇరవై వేలో కాదు.. ఏకంగా 1,90,000 వేల రూపాయలు పోయాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగి గుండెలు బాదుకున్నాడు. వెంటనే హింగోలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. సైబర్ సెల్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వెడ్డింగ్ ఇన్విటేషన్ల పేరిట ప్రతీ ఏటా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి. చదువురాని వారే కాకుండా చదువుకున్న వాళ్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, నీటమునిగిన ఇళ్లు

బెట్టింగ్ యాప్స్ కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..

Updated Date - Aug 23 , 2025 | 03:31 PM