Congress MLA Betting Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
ABN , Publish Date - Aug 23 , 2025 | 02:57 PM
Congress MLA Betting Case: ఈ సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఏకంగా 12 కోట్ల నగదు దొరికింది. ఇందులో కోటి రూపాయలు విలువ చేసే ఫారెన్ కరెన్సీ కూడా ఉంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కర్ణాటక ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సిక్కిమ్‌లోని గ్యాంగ్‌టక్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కేసీ వీరేంద్రకు చెందిన 60 ప్రదేశాల్లో యాంటీ మనీ ల్యాండరింగ్ ఎజెన్సీ నిన్న (శుక్రవారం) సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఏకంగా 12 కోట్ల నగదు దొరికింది. ఇందులో కోటి రూపాయలు విలువ చేసే ఫారెన్ కరెన్సీ కూడా ఉంది. నగదుతో పాటు 6 కోట్ల విలువ చేసే బంగారు నగలు, 10 కేజీల వెండి నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఎమ్మెల్యేకు చెందిన 17 బ్యాంకు అకౌంట్లను, రెండు బ్యాంకు లాకర్లను సెంట్రల్ ఏజెన్సీ ఫ్రీజ్ చేసింది.

కేసీ వీరేంద్రతో పాటు ఆయన సోదరుడు కేసీ నాగరాజు, అతడి కొడుకు పృధ్వీ ఎన్ రాజ్‌కు చెందిన పలు ఆస్తుల తాలూకా డాక్యుమెంట్స్‌ను ఈడీ సీజ్ చేసింది. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కేసీ తిప్పెస్వామీ, పృధ్వీ ఎన్ రాజ్‌లు దుబాయ్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు ఆయన్ని గ్యాంగ్‌టక్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
ఆరోగ్య బీమా ప్రీమియం పెంపుదలను IRDAI నియంత్రిస్తుందా..