Share News

Cloudburst Hits Uttarakhand : ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, నీటమునిగిన ఇళ్లు

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:23 PM

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరుణుడు ప్రకోపించాడు. రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలో ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు.

Cloudburst Hits Uttarakhand : ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, నీటమునిగిన ఇళ్లు
Cloudburst Hits Uttarakhand

ఉత్తరాఖండ్, ఆగస్టు 23 : ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరుణుడు ప్రకోపించాడు. నిన్న (శుక్రవారం) రాత్రి నుంచి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది.


అధికారుల చెబుతున్న వివరాల ప్రకారం, థరాలి మార్కెట్ ప్రాంతం, థరాలి తహసీల్ కాంప్లెక్స్ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలు సహా అనేక నివాస ప్రాంతాలు నీటలో చిక్కుకున్నాయి. సమీపంలోని సగ్వారా గ్రామంలో, ఒక భవనం లోపల బాలిక చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.


కొన్ని చోట్ల స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులెత్తారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. చెప్డాన్ మార్కెట్ ప్రాంతంలోని కొన్ని దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా థరాలి-గ్వాల్డామ్ రోడ్డు, థరాలి-సగ్వారా రోడ్డు మూతపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి..

ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్ర పోలీసుల కేసు

అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 03:38 PM