Share News

CBI Raids Anil Ambani: అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:12 PM

అనిల్ అంబానీ నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీ పాత్ర ఉన్నట్లు భావిస్తున్న CBI ఆయన ఆసీసుల్లో, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.

CBI Raids Anil Ambani: అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీ ఆసీసుల్లో, నివాసాల్లో CBI అధికారులు సోదాలు చేస్తున్నారు. రిలయన్స్ ఇన్ ఫ్రా సహా ఆయనకు చెందిన పలు కంపెనీలలో CBI సోదాలు కొనసాగుతున్నాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించి బ్యాంకును మోసం చేసిన కేసులో అనిల్‌ అంబానీ నివాసాల్లో, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఆర్‌కామ్ ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీకి సంబంధించిన అన్ని ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిల్ గ్రూప్‌ కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఇప్పటికే ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయన్ను 10 గంటల పాటు ప్రశ్నించింది.

Updated Date - Aug 23 , 2025 | 12:28 PM